సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరియర్ చాలా సంవత్సరాల పాటు ఉండదు. కొంత మంది నటీమణులు మాత్రమే హీరోల స్థాయిలో కెరీర్ ను కొనసాగిస్తూ ఉంటారు. అలా సినిమా పరిశ్రమలో ఎక్కువ సంవత్సరాల పాటు అద్భుతమైన స్థాయిలో కెరియర్ను కొనసాగిస్తున్న బ్యూటీలలో త్రిష ఒకరు. ఈ ముద్దుగుమ్మ దాదాపు 20 సంవత్సరాలకు ముందే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈమె ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ కాలంలోనే అద్భుతమైన విజయాలను అందుకొని టాలీవుడ్ , బాలీవుడ్ ఇండస్ట్రీలలో టాప్ హీరోయిన్ స్థాయికి వెళ్ళింది.

టాప్ హీరోయిన్ స్థాయికి వెళ్లిన తర్వాత ఈమె మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇప్పటికి కూడా ఈమె అటు తమిళ్ , ఇటు తెలుగు సినీ పరిశ్రమలలో అద్భుతమైన సినిమా అవకాశాలను దక్కించుకుంటుంది. ఇక తమిళ ఇండస్ట్రీలో నైతే ఈమె ఇప్పటికీ టాప్ హీరోయిన్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తూ కుర్ర హీరోయిన్లకు కూడా పోటీని ఇస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ బ్యూటీ కి ఇప్పటికి కూడా అద్భుతమైన క్రేజ్ ఉండడంతో భారీ మొత్తంలోనే ఈమె ఒక్కో సినిమాకు పారితోషకాన్ని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

కొంత కాలం క్రితం ఈ బ్యూటీ కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి దళపతి విజయ్ సరసన లియో సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కోసం ఈ బ్యూటీ సుమారుగా 5 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు ఇండస్ట్రీలో ఓ పెద్ద చర్చ నడిచింది. ఇకపోతే త్రిష ఆస్తుల విషయానికి వస్తే ఇప్పటి వరకు ఈమె నెట్ వర్త్ 85 కోట్ల రూపాయలు ఉందని తెలుస్తోంది. ఇక త్రిష ఆస్తుల విషానికి వస్తే చెన్నై లో ఈమెకు 10 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాదు లో ఒక విలాసవంతమైన బంగ్లా ఉన్నట్లు సమాచారం. హైదరాబాదులో త్రిష ఇంటి విలువ దాదాపు 6 కోట్ల విలువ ఉంటుంది అని అంచనా. అలాగే త్రిష కి విలువైన లగ్జరీ కార్లు కూడా చాలానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా ఈ బ్యూటీకి అనేక విలువైన ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: