నందమూరి నట సింహం బాలకృష్ణ కెరియర్ ను ప్రారంభించిన చాలా సంవత్సరాల వరకు కేవలం సినిమాల్లో నటించడం తప్ప ఏ టీవీ షో లకు గాని , ఇతర షో లకు గాని హోస్ట్ గా వ్యవహరించడం జరగలేదు. ఈయన తన కెరియర్ లో మొట్ట మొదటి సారి ఆహా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అయిన అన్ స్టాపబుల్ అనే టాక్ షో కు హోస్ట్ గా వ్యవహరించాడు. ఇక కెరియర్ లో మొట్ట మొదటి సారి బాలకృష్ణ ఒక టాక్ షో కు హోస్ట్ గా వ్యవహరిస్తూ ఉండడంతో దీనిపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక బాలకృష్ణ కూడా తనదైన రీతిలో ఈ షో కి హోస్టింగ్ చేయడంతో ఈ షో కు మంచి క్రేజ్ లభించింది.

ఇప్పటికే ఈ షో కు సంబంధించిన కొన్ని సీజన్లు పూర్తి కాగా అవి అద్భుతమైన సక్సెస్ ను సాధించాయి.  మరికొన్ని రోజుల్లోనే ఈ టాక్ షో కు సంబంధించిన మరో సీజన్ కూడా ప్రారంభం కాబోతోంది. ప్రతి సారి ఆన్ స్టాపబుల్ సీజన్ ప్రారంభం కాబోతోంది అంటే చాలు దానికి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా రాబోతున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న మాస్ హీరోలు కావడంతో వీరిద్దరూ ఒకే స్టేజీపై కనిపించబోతున్నారు అని ప్రతి సారి వార్తలు వస్తూ ఉన్నాయి.

ఇకపోతే మరికొన్ని రోజుల్లోనే ఈ టాక్ షో నెక్స్ట్ సీజన్ ప్రారంభం కానుండడంతో మళ్లీ ఈ టాక్ షో నెక్స్ట్ సీజన్ ప్రారంభ ఎపిసోడ్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ప్రతిసారి వార్తలు రావడం తప్ప చిరంజీవి మాత్రం ఈ షోక్కు గెస్ట్ గా రావడం లేదు. మరి ఈసారైనా చిరంజీవి ఈ షో కు గెస్ట్ గా వస్తాడో లేదో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. ఇది ఇలా ఉంటే బాలయ్య అభిమానులతో పాటు అనేక మంది ప్రేక్షకులు కూడా ఈ షో నెక్స్ట్ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని వేచి చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: