ఎన్టీఆర్ దేవర సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రెండు పార్టులుగా తెరకెక్కుతున్న దేవర సినిమా నుంచి పార్ట్ 1 సెప్టెంబర్ 27 న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్ కి దగ్గరికి రావడంతో శరవేగంగా షూటింగ్ పూర్తిచేస్తున్నారు.ప్రస్తుతం దేవర సినిమాలో ఒక సాంగ్ ని రాత్రి పూట షూట్ చేస్తున్నారు.వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ఓ రేంజ్ రెస్పాన్స్ రాగా, ఇటీవల రిలీజైన చుట్టమల్లె సాంగ్ అయితే క్రేజీ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది. ఈ పాటతో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది.మరి మొదటి పాట సహా రెండో సాంగ్ కి కొంచెం డివైడ్ టాక్ వచ్చినప్పటికీ అవి మెల్లగా సెన్సేషనల్ చార్ట్ బస్టర్ అయ్యాయి. అయితే ఇక అంతా మూడో సాంగ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్న రత్నవేలు సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన పోస్ట్ ను షేర్ చేశారు..సెట్‌లో దిగిన ఫొటో షేర్‌ చేసిన ఆయన .. ‘‘ఈ చిత్రంలోని ఓపెనింగ్‌ సాంగ్‌ షూట్‌ చేస్తున్నాం. అద్భుతమైన విజువల్స్‌.. అనిరుధ్‌ మ్యూజిక్‌తో ఇది చాలా చక్కగా సిద్థమవుతోంది. డ్యాన్స్‌లో ఎన్టీఆర్‌ గ్రేస్‌, స్టైల్‌ మామూలుగా లేవు. ఫాన్స్‌కు పూనకాలు పక్కా’’ అని పేర్కొన్నారు.
ఈ పాటకు ప్రముఖ డ్యాన్స్‌ మాస్టర్‌ గణేశ్‌ ఆచార్య కొరియోగ్రఫీ చేస్తున్నారని ఆయన అన్నారు. రత్నవేలు పోస్ట్‌తో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. సినిమా కోసం వెయిటింగ్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఈ నేపథ్యంలోనే షూటింగ్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. విస్మరణకు గురైన ఓ తీర ప్రాంతం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.  ఇటీవల ఈ సినిమా నుంచి రెండో సాంగ్‌ విడుదలైంది. ‘చుట్టమల్లే’ అంటూ సాగే ఈ పాటలో ఎన్టీఆర్‌ - జాన్వీకపూర్‌పై చిత్రీకరించారు. ఈ ఈ పాటకు యూట్యూబ్‌లో దాదాపు 45 మిలియన్ల వ్యూస్‌ సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: