సీతారామం తర్వాత హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ లాంటి సూపర్ హిట్స్ మూవీలో నటించింది. ఆ తర్వాత ఆమెకు తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. ఇక తమిళంలో హీరో శివకార్తికేయన్ సరసన అవకాశం వచ్చినా దాన్ని చేజార్చుకుందనే టాక్ వినిపిస్తోంది. మృణాల్ తాను నటించిన సినిమాలన్నింటిలో హోమ్లీ పాత్రలే చేసింది. అయితే తన కెరీర్ మొదట్లో లిప్ లాక్ సీన్స్ చేసి తన పేరెంట్స్‌కు షాకివ్వడంతో వారు స్ట్రిక్ట్ రూల్ పెట్టారు. ఇకపై లిక్ లాక్ సీన్స్ లో నటించొద్దని తెగేసి చెప్పేశారట. దీంతో అప్పటి నుంచి తాను లిక్ లాక్ సీన్లు చేయనని అనుకుందట. అలా అనుకోవడం వల్ల చాలా అవకాశాలను చేజార్చుకున్నట్లు మృణాల్ ఠాకూర్ పలు సందర్భాల్లోనూ చెప్పుకొచ్చింది.
అవకాశాలు కోల్పోతుండటంతో తన తల్లిదండ్రులను కూర్చోబెట్టుకుని మృణాల్ మాట్లాడిందట. లిక్ లాక్ సీన్లు చేయకపోతే జరిగే పరిణామాలను వివరించిందట. దీంతో మృణాల్ తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకుని ఒప్పుకున్నారట. మొత్తానికి ఈ సీతారామం బ్యూటీ తన పేరెంట్స్‌ను కన్వీన్స్ చేసి మరీ తాను అనుకున్నది చేస్తోందని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మృణాల్ ఠాకూర్ సినిమాలు సంవత్సరానికి నాలుగైనా రావాలని ఫ్యాన్స్ బాగా డిమాండ్ చేస్తున్నారు.