జూనియర్ ఎన్టీఆర్ గురించి తెలుగు జనాలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదేవిధంగా ఆయన భార్య అయినటువంటి లక్ష్మీ ప్రణతి గురించి కూడా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగులో ఉన్న అగ్ర హీరోలలో ఈ జూనియర్ ఎన్టీఆర్ చాలా ప్రత్యేకమైన వారు. ఎన్టీఆర్ యాక్టింగ్, డాన్స్ అంటే అభిమానులు పడి చచ్చిపోతారు. అందుకే ఆయన సినిమాలలో ఈ రెండు ప్రత్యేకంగా ఉన్నట్టు చూసుకుంటారు. ఇక బడా సెలబ్రిటీల వైవాహిక జీవితం అనేది అభిమానులకు చాలా ఆసక్తికరమైన అంశంగా ఉంటుంది. ఈ క్రమంలోనే నిరంతరం సోషల్ మీడియాలో వారికి సంబంధించిన ఏదో ఒక అంశం గురించి తెలుసుకోవాలని వెతుకుతూ ఉంటారు.

ఇక జూనియర్ ఎన్టీఆర్ - లక్ష్మీ ప్రణతి అన్యోన్య దాంపత్యం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు. లక్ష్మీ ప్రణతి పెద్దగా బయట కనబడిన దాఖలాలు మనకు కనిపించవు. ఎప్పుడో అరుదుగా ఏవైనా ఫ్యామిలీ ఫంక్షన్స్ లో మాత్రమే ఆమె కనబడుతుంది. ఒకవేళ ఆమె బయటికి వచ్చిన మాట్లాడడం చాలా తక్కువే అని చెప్పుకోవాలి. అయితే మిగతా హీరోల భార్యలు ఈమెకి భిన్నంగా వ్యవహరిస్తారు. సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది. అంతేకాదండోయ్.. మహేష్ బాబు పర్సనల్ వ్యవహారాలలో కూడా ఆమె పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన గురించి కూడా మీకు తెలిసిందే. ఈమె నిరంతరం సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు టచ్ లోనే ఉంటుంది. ముఖ్యంగా హెల్త్ కు సంబంధించి అనే విషయాలు ఈమె పంచుకుంటూ ఉంటుంది. చాలామంది అగ్ర తారల భార్యలు తమ ఉనికిని చాటుకుంటూ ఉంటారు.

కానీ లక్ష్మీ ప్రణతి వారికి భిన్నమనే చెప్పుకోవాలి. తాజాగా ఇదే విషయాన్ని ఆమె తమ్ముడు నార్నీ నితిన్ ఓ మీడియా వేదికగా అక్క లక్ష్మీ ప్రణతి గురించి చెప్పుకొచ్చాడు. నార్నీ నితిన్ ప్రధాన పాత్ర పోషించిన సినిమా 'ఆయ్'... ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా అక్క లక్ష్మీ ప్రణతి గురించి కొన్ని రహస్యాలు చెప్పుకొచ్చాడు. లక్ష్మీ ప్రణతి సాధారణంగా బయట ఎక్కువగా తిరగదని, ఒకవేళ బయటకు వచ్చిన, పెద్దగా ఎవరిలోనూ కలవదని చెప్పుకొచ్చాడు. కానీ ఆమె ఫ్యామిలీ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు వహిస్తుందని... కంప్లీట్ ఫ్యామిలీ పర్సన్ అని చెప్పుకొచ్చాడు. జూనియర్ ఎన్టీఆర్ - లక్ష్మీ ప్రణతి వివాహం 2011 లో జరిగింది. నేటికి దాదాపు వీరి వివాహం అయ్యి 12 సంవత్సరాలు కావస్తోంది. టాలీవుడ్ లో ఉన్న అన్యోన్య దాంపత్యలలో వీరిది కూడా ఒకటి.

మరింత సమాచారం తెలుసుకోండి: