టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన బాయ్స్ మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. తమిళ్ లో రూపొందిన ఈ సినిమా తెలుగు లో కూడా విడుదల అయ్యి అద్భుతమైన విజయం అందుకుంది. ఈ సినిమాతో సిద్ధార్థ్ కి తమిళ్ తో పాటు తెలుగు లో కూడా మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈయనకు తెలుగులో సినిమా అవకాశాలు దక్కడం మొదలు అయింది.

ఇక సిద్ధార్థ్ నటించిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు సినిమాలు తెలుగు లో రూపొంది బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. అలాగే ఆట మరికొన్ని సినిమాలు పర్వాలేదు అనే స్థాయి విజయాలను అందుకున్నాయి. ఈ మూవీ లతో సిద్ధార్థ్ క్రేజ్ తెలుగులో భారీగా పెరిగింది. ఆ తర్వాత ఈయన నటించిన సినిమాలు వరుసగా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొడుతూ వచ్చాయి. తెలుగు లో క్రేజ్ తగ్గడంతో ఈ నటుడు తమిళ ఇండస్ట్రీ పై ఫోకస్ పెట్టాడు. అందులో భాగంగా అనేక తమిళ సినిమాలలో ఇప్పటికే కూడా నటిస్తున్నాడు.

తాజాగా కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 అనే మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో సిద్ధార్థ్ ఓ కీలకమైన పాత్రలో నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ సినిమాలో సిద్ధార్థ్ పాత్రకు మొదట శంకర్ కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి శివ కార్తికేయన్ ను అనుకున్నాడట. కాకపోతే ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉండడం వల్ల చేయలేకపోయాడట. దానితో ఈ ఆఫర్ సిద్ధార్థ్ కి వచ్చినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: