తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ హీరోలలో ఎక్కువ శాతం మంది హీరోలు చాలా వరకు సంక్రాంతి సీజన్ లో తమ సినిమాలను విడుదల చేయాలి అని అనుకుంటూ ఉంటారు. దానికి ప్రధాన కారణం సంక్రాంతి సమయంలో ఎక్కువ శాతం మంది జనాలు సినిమాలను చూడాలి అనుకోవడం. దానితో కాస్త సినిమాకు యావరేజ్ టాక్ వచ్చిన కూడా స్టార్ హీరోలు నటించిన సినిమాలకు మంచి స్థాయిలో కలెక్షన్లు వస్తూ ఉంటాయి. దానితో అనేక మంది హీరోలు సంక్రాంతి సీజన్ ను టార్గెట్ చేస్తూ మరీ సినిమాలను విడుదల చేస్తూ ఉంటారు.

కానీ ఈ సీజన్ జూనియర్ ఎన్టీఆర్ కి మాత్రం పెద్దగా కలిసి రాలేదు. ఇప్పటి వరకు ఎన్టీఆర్ చాలా సినిమాలలో హీరోగా నటించగా అందులో కేవలం ఐదు సినిమాలు మాత్రమే సంక్రాంతి సీజన్ కు విడుదల అయ్యాయి. అందులో మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టగా , కేవలం రెండు సినిమాలు మాత్రమే మంచి విజయాలను అందుకున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్లో మొదటి సారిగా నా అల్లుడు అనే సినిమాతో సంక్రాంతి బరిలో నిలిచాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆ తర్వాత ఆంధ్రావాలా అనే సినిమాతో రెండవ సారి జూనియర్ ఎన్టీఆర్ సంక్రాంతి బరిలో ఉన్నాడు. ఈ సినిమా కూడా ఈయనకు అపజయాన్ని అందించింది.

ఇక ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ "నాగ" అనే మూవీ తో సంక్రాంతి బరిలో నిలిచాడు. ఈ మూవీ కూడా ఈయనకు నిరాశనే మిగిల్చింది. ఆ తర్వాత ఎన్టీఆర్ "అదుర్స్" మూవీ తో సంక్రాంతి బరులో నిలిచాడు. ఈ మూవీ మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఆఖరుగా ఎన్టీఆర్ సంక్రాంతి రేసులో నాన్నకు ప్రేమతో సినిమాతో ఉన్నాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఇలా జూనియర్ ఎన్టీఆర్ తన కెరియర్లో ఐదు సార్లు సంక్రాంతి బరిలో నిలవగా అందులో మూడు సార్లు అపజాయలను , రెండు సార్లు విజయాలను అందుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: