వేణు స్వామి.. గత కొద్ది రోజులుగా సైలెంట్ అయ్యి మళ్ళీ సోషల్ మీడియాలో హైలెట్ అయ్యారు.అయితే ఏపీ ఎలక్షన్స్ రిజల్ట్ తర్వాత నేను ఇప్పటినుండి రాజకీయ నాయకులకు సంబంధించి సెలబ్రిటీలకు సంబంధించి ఎలాంటి జాతకాలు చెప్పను అని అన్నారు.కానీ తాజాగా నాగచైతన్య శోభిత దూళిపాళ్ల జాతకం చెప్పి మళ్ళీ అడ్డంగా బుక్కయ్యారు.ఇక ఈయన విషయంపై ఫైర్ అయిన తెలుగు ఫిలిం జర్నలిస్టులు కూడా ఈయనపై కంప్లైంట్ ఇచ్చి చర్యలు తీసుకునేలా పోలీసులకు చెప్పాలని ఆలోచన చేసినట్టు కూడా టాక్ వినిపిస్తున్న వేళ తాజాగా తాను ఆ హీరోయిన్ కోసమే వీరిద్దరి జాతకం చెప్పాను అంటూ సంచలన కామెంట్లు చేశారు వేణు స్వామి.అయితే వేణు స్వామి మాట్లాడుతూ..  నేను సమంత నాగచైతన్య జాతకం అప్పట్లో చెప్పాను.

అయితే దానికి కొనసాగింపుగానే శోభిత నాగచైతన్య జాతకం ఎలా ఉంటుందో చెప్పాను. అంతేకానీ ఇచ్చిన మాట తప్పలేదు.నేను సెలబ్రిటీలకు సంబంధించి,రాజకీయ నాయకులకు సంబంధించి ఎలాంటి పర్సనల్ విషయాలను బహిరంగంగా చెప్పనని మాట ఇచ్చాను.దానికి ఇప్పడికీ కట్టుబడే ఉన్నాను. తాజాగా మా అధ్యక్షుడు మంచు విష్ణు కూడా నాకు ఫోన్ చేసి ఈ విషయం గురించి వివరణ అడిగారు.ఆయనతో కూడా నేను ఇదే విషయం చెప్పాను.సమంత జాతకానికి కంటిన్యూగానే వీరిద్దరి జాతకం కూడా చెప్పాను.నేను ఇచ్చిన మాటకి కట్టుబడే ఉన్నాను. ఇప్పటి నుండి సెలబ్రిటీలు ఎవరైనా సరే నా దగ్గరికి వచ్చి జాతకాలు చెప్పమని అడగకండి.నేను సెలబ్రెటీల జాతకాలు చెప్పడం మానేస్తున్నాను అని మంచు విష్ణు తో ఫోన్లో మాట్లాడినప్పుడు ఇదే విషయం చెప్పాను.

మంచి నిర్ణయం తీసుకున్నారని  మంచు విష్ణు కూడా నాతో అన్నారు.ఎప్పటికైనా సరే ఇదే మాటకు కట్టుబడి ఉంటాను అంటూ వేణు స్వామి మాట్లాడిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారడంతో ప్రతిసారి ఇదే మ్యాటర్ చెబుతూ మళ్లీ సోషల్ మీడియాలో హైలెట్ అవ్వడం కోసం ఇలా సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు చెబుతూ వారి ప్రైవసీని చెడగొడుతున్నారు.ఇప్పటికైనా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారా..లేక మరెవరైనా సెలబ్రిటీ విషయంలో మళ్ళీ జాతకాలు చెప్పడం మొదలు పెడతారా అని ఫైర్ అవుతున్నారు వేణు స్వామి మాటలు విన్న నెటిజన్స్.మరి వేణు స్వామి ఇప్పటికైనా ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటారా లేదా అనేది ముందు ముందు తెలుస్తుంది

మరింత సమాచారం తెలుసుకోండి: