దగ్గుబాటి రామానాయుడు మనవడు రానా లీడర్ మూవీ తో ఇండస్ట్రీ లోకి హీరోగా రంగ ప్రవేశం చేశారు. అయితే ఈయన కేవలం హీరో మాత్రమే కాదు విజువల్ ఎఫెక్ట్ సమన్వయకర్తగా పనిచేసే  విలన్ గా కూడా చాలా సినిమాల్లో మెప్పించారు. బాహుబలి వంటి పాన్ ఇండియా మూవీలో హీరోకి ఏమాత్రం తీసిపోని విలన్ పాత్రలో నటించి స్టార్ స్టేటస్ సంపాదించారు. అలాగే రానా నాయుడు వెబ్ సిరీస్ ద్వారా రానా పేరు మరింత ఫేమస్ అయ్యారు. అయితే అలాంటి రానా సినీ కెరీర్ బాగున్నప్పటికీ పర్సనల్ కెరియర్ లో మాత్రం ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి. ఈయన ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది అమ్మాయిలతో డేటింగ్ చేయడంతో ఈయన పేరు ఎప్పుడు మీడియాలో వైరల్ గానే ఉండేది.. డేటింగ్ వార్తలన్నింటికి చెక్ పెడుతూ  మిహికా బజాజ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే రానా మిహికల పెళ్లి చాలా వెరైటీగా జరిగిందట. 

వీరిద్దరూ పరిచయమైన వారం రోజుల్లోనే పెళ్లి చేసుకున్నారట.మరి వీరి లవ్ స్టోరీ ఏంటి.. వారం రోజుల్లో పెళ్లి ఎలా జరిగింది అనేది ఇప్పుడు చూద్దాం.దగ్గుబాటి రానా,మిహికా బజాజ్ ల పెళ్లి కరోనా సమయంలో చాలా సింపుల్ గా జరిగింది.. అయితే కరోనా సమయంలో నితిన్, నిఖిల్ వంటి హీరోల పెళ్లిళ్లు కూడా జరిగాయి. కరోనా సమయంలో లాక్ డౌన్ కారణంగా చాలామంది ఇంటి పట్టునే ఉన్నారు. ఇక ఇదే సమయంలో రానా హౌజ్ పార్టీ అనే ఒక యాప్ ని డౌన్లోడ్ చేసుకొని కొద్దిరోజులు యూస్ చేశారట.అలా ఆ యాప్ వాడినా కొద్ది రోజుల్లోనే ఓ అమ్మాయిని ఆ యాప్ ద్వారా కలిసాడట. ఆమె ఎవరో కాదు మిహికా బజాజ్..అయితే ఈ యాప్ ద్వారా ఎంతో మందిని మీట్ అవచ్చు. మీట్ అవ్వడమే కాదు మనకు తెలిసినవారిని ఆ యాప్ లో యాడ్ చేయవచ్చట. అలా చాలా సంవత్సరాల కింద చూసిన ఒక అమ్మాయి ఆ యాప్ లో కనిపించింది.

ఇక ఆ అమ్మాయి మిహికా బజాజ్..అలా వీరిద్దరూ ఆ యాప్ ద్వారా కలుసుకొని వారం రోజుల్లోనే పెళ్లి చేసుకుంటాను అని మ్యారేజ్ ప్రపోజల్ రానా మిహికా బజాజ్ ముందు పెట్టారట.అయితే కలిసిన వారానికే పెళ్లి ఏంటి అని మిహికా మొదట్లో షాక్ అయిందట. అంతేకాదు రానా అలా ప్రపోజల్ పెట్టి సరదాగా cఆటపటిస్తున్నాడు కావచ్చు అని భావించిందట.కానీ ఆ తర్వాత ఇది నిజమే అని తెలియడంతో తనకు తెలిసిన వ్యక్తుల ద్వారా రానాకి సంబంధించిన బ్యాగ్రౌండ్ అంతా తెలుసుకొని చివర్లో ఓకే చెప్పిందట. అలా హౌజ్ పార్టీ యాప్ ద్వారా కలిసిన వారం రోజుల్లోనే రానా దగ్గుబాటి,మిహికా బజాజ్ ల పెళ్లి హడావిడిగా జరిగిపోయింది. అయితే ఇది నా జీవితంలో చాలా క్రేజీయెస్ట్ మూమెంట్ అంటూ రానా దగ్గుబాటి ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు

మరింత సమాచారం తెలుసుకోండి: