టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు అన్న విషయం తెలిసింది. ప్రస్తుతానికి ఆయన చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటి రవితేజ హీరోగా చేస్తున్న మిస్టర్ బచ్చన్ కాగా మరొకటి పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న భవదీయుడు భగత్ సింగ్ సినిమా. భవదీయుడు భగత్ సింగ్ సినిమా షూటింగ్ ఇంకా పూర్తికాలేదు. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయం కూడా క్లారిటీ లేదు. అయితే రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా ఈ సినిమాని ఆగస్టు 15వ తేదీన రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.మిస్టర్ బచ్చన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం నాడు కర్నూలులో జరిగింది. రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆగస్ట్ 15న విడుదల చేయబోతోన్నారు. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ‘నేను సినిమా స్టార్ట్ చేయాలన్నా.. ముందుకు తీసుకెళ్లాలన్నా.. నా రైటింగ్ టీం ఉండాలి.. వాళ్లే నా బలం.. భాస్కర భట్ల గారి పాటలు లేకుంటే నా సినిమా స్టార్ట్ కాదు.. కాసర్ల శ్యాం గారితో ఇప్పుడే పని చేయడం స్టార్ట్ చేశా.. సాహితి గారు ఆరోగ్య రిత్యా ఇక్కడకు రాలేకపోయారు.. నా సినిమా ఆగస్ట్ 15న కాదు.. ఆగస్ట్ 14న సాయంత్రమే ప్రీమియర్ల రూపంలో రాబోతోంది.. మాకు మంచి థియేటర్లు ఇచ్చినందుకు థాంక్స్. ఆగస్ట్ 15న మా గురువు గారు పూరి జగన్నాథ్ తీసిన డబుల్ ఇస్మార్ట్ కూడా రాబోతోంది.. ఆ సినిమాను కూడా చూసి సక్సెస్ చేయండి..

నేను అడిగిన దాని కంటే ఎక్కువగా ఇచ్చిన నిర్మాత విశ్వ ప్రసాద్ గారికి థాంక్స్.పీపుల్స్ మీడియా వల్ల ఈ మూవీ ఇంత వేగంగా పూర్తయింది..బోస్ లేకుండా ఈ సినిమాలోని ఒక్క ఫ్రేమ్ కూడా ఊహించుకోలేను.. భాగ్య శ్రీ ఎంతో కష్టపడుతుంటుంది.. ఎక్కువగా పొగిడితే దిష్టి తగులుతుంది.. తెలుగులో కూడా డబ్బింగ్ చెప్పుకుంది..ఈ సినిమాకు నా కంటే ఎక్కువగా కష్టపడుతున్నాడు బాబీ. మిరపకాయ్ టైటిల్‌ను రవితేజ గారే పెట్టారు.. మిస్టర్ బచ్చన్ టైటిల్‌ని కూడా ఆయనే పెట్టారు.. నా జీవితంలో హోప్ అంటే ఆయనే.. అమ్మానాన్నలు ఒకేసారి జన్మను ఇస్తారు.. కానీ నాకు రవితేజ గారు పునర్జన్మను కూడా ఇచ్చారు.. ఆయన లేకపోతే నా సినిమా కెరీర్ ఉండేది కాదు..మిక్కీ జే మేయర్ అద్భుతమైన పాటలు ఇచ్చారు.. ఆయన కామ్‌గా ఉంటాడు.. నేను ఆవేశంగా ఉంటాను.. మీడియాతో మాట్లాడుతూ ఉంటే.. పంచ్‌లు, కౌంటర్లు అని అంతా అనుకుంటున్నారు.. కానీ అలాంటివి విన్నప్పుడు నేను ఎంజాయ్ చేయడం లేదు.. మీకు నచ్చినట్టుగా రివ్యూలు, రేటింగ్‌లు ఇచ్చుకోండి.. ఆత్మాభిమానం దెబ్బతిన్నప్పుడు అలా ఇద్దరి ముగ్గురితో కాస్త గట్టిగా మాట్లాడానంతే.. పంచ్‌లు వేయడానికి మీడియాతో మాట్లాడటం లేదు.. ఇది గ్రాటిట్యూడ్ టైం.. ఆటిట్యూడ్ టైం కాదు..ఇది రిపీట్ ఆడియెన్స్ ఉండే సినిమా’ అని స్పీచ్ ముగించాడు. ఇక స్పీచ్ మధ్యలో ఓ ఫ్యాన్ అరుస్తుంటే.. రేయ్ నువ్వు ఎక్కువగా అరుస్తున్నావ్.. నీ సోషల్ మీడియా ఐడీ నాకు తెలుసు.. బ్లాక్ చేస్తా అని వార్నింగ్ ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: