ఇలాంటి సమయంలోనే సమంత ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదేమిటంటే టాలీవుడ్ కు దూరంగా ఉంటూ ముంబైలో ఎక్కువ సమయాన్ని గడపాలనే నిర్ణయాన్ని సమంత తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే సమంత ప్రస్తుతం ఎక్కువగా ముంబై ప్రాంతంలోనే ఉంటోందట. అంతేకాకుండా తెలుగు సినిమాలలో కూడా కనిపించడానికి ఇష్టపడలేదని సమాచారం. బాలీవుడ్ హాలీవుడ్ లోనే పలు వెబ్ సిరీస్లలో నటించడానికి ఇష్టపడుతోందట సమంత. అందుకే తెలుగులో ఇప్పటివరకు ఏ ఒక్క సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది.
అయితే ఈ విషయం అభిమానులకు కాస్త చేదుగానే ఉన్నప్పటికీ ఎక్కడ ఉన్నా కూడా తమ హీరోయిన్ ఆరోగ్యంగా బాగుండాలని అభిమానులైతే కోరుకుంటున్నారు. అంతేకా కుండా రెండవ పెళ్లి చేసుకోబోతోంది అంటూ రూమర్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఈ విషయం పైన కూడా సమంత స్పందించలేదు.. కానీ చై , శోభిత ఎంగేజ్మెంట్ తర్వాత సమంత స్నేహితులు మాత్రం ఇన్ డైరెక్ట్ గా సెటైర్లు వేస్తూ కొన్ని పోస్టు సైతం షేర్ చేశారు. సమంత పైన వస్తున్న ఈ రూమర్స్ నిజమో కాదో తెలియాల్సి ఉన్నది. పలు వెబ్ సిరీస్లలో టాప్ రెమ్యూనరేషన్ కింద 10 కోట్ల రూపాయల వరకు తీసుకుంటుందట ఈ ముద్దుగుమ్మ.