చిరంజీవి వారసులుగా ఇండస్ట్రీలోకి రామ్ చరణ్ తో పాటు ఆయన కుటుంబంలోని చాలామంది ఎంట్రీ ఇచ్చారు. అలా నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ కూడా ముకుంద మూవీతో సినీ రంగ ప్రవేశం చేశారు.అయితే మొదటి సినిమా హిట్ కొట్టలేదు.ఈయనకు మొదటి బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది మాత్రం ఫిదా మూవీ తో అని చెప్పుకోవచ్చు.ఈ సినిమాతో వరుణ్ తేజ్ కి ఇండస్ట్రీలో మంచి నేమ్ ఫేమ్ రావడమే కాకుండా మెగా ప్రిన్స్ అనే ట్యాగ్ కూడా వచ్చింది.అయితే అలాంటి వరుణ్ తేజ్ కి చిరంజీవికి మధ్య ఉన్న గొడవ ఏంటి..వరుణ్ తేజ్ ని జీవితంలో ఎప్పటికీ క్షమించను అని చిరంజీవి ఎందుకు ఫైర్ అయ్యారు అనేది ఇప్పుడు చూద్దాం.. వరుణ్ తేజ్ చిరంజీవి మధ్య ఎలాంటి గొడవ లేదు. కానీ చిరంజీవికి ఎలాంటి విషయమైనా సరే ముందుగానే వరుణ్ తేజ్ చెబుతారట. 

అలాగే తండ్రి కంటే ఎక్కువ క్లోజ్ గా చిరంజీవితోనే వరుణ్ తేజ్ ఉంటారట.అలా వీరి మధ్య ఏ విషయం కూడా దాగదట.అంతేకాకుండా వరుణ్ ఏదైనా పని మొదలు పెట్టారంటే ముందుగా చిరంజీవికే చెబుతారట.కానీ ఒక్క విషయం మాత్రం చెప్పలేదట. దాంతో ఆయన ఈ విషయం గురించి ఆపరేషన్ వాలెంటైన్ అనే సినిమా రిలీజ్ ఈవెంట్లో బయటపెట్టారు.. చిరంజీవి ఆపరేషన్ వాలెంటైన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చిన సమయంలో యాంకర్ మాట్లాడుతూ మీరు ఎందుకు చిరు లీక్స్ ద్వారా లావణ్య త్రిపాఠి మీ ఇంటి కోడలు కాబోతుంది అనే విషయాన్ని బయట పెట్టలేదు అని అడిగింది.

దానికి చిరంజీవి అసలు ఈ విషయం నాకు ముందుగా తెలిస్తే కదా చిరు లీక్స్ ద్వారా బయట పెట్టడానికి.. ఎప్పుడూ నాకే అన్ని విషయాలు ముందుగా చెబుతాను అనే వరుణ్ తేజ్ ఈ విషయం మాత్రం దాచాడు. అంతేకాదు నన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇండస్ట్రీలోకి వచ్చాను పెదనాన్న..మీరేనా ఆదర్శం అని చెబుతూ ఉంటాడు. కానీ ఈ విషయం మాత్రం దాచిపెట్టాడు. తన ప్రేమ విషయం నాకు చెప్పలేదు కాబట్టి ఈ విషయంలో నేను వాడిని జీవితంలో ఎప్పటికి క్షమించను అంటూ సరదాగా చెప్పారు.అయితే చిరంజీవి మాటలకు వరుణ్ తేజ్ వెంటనే స్పందిస్తూ..  మీ మీద ఉండే గౌరవంతో కూడిన భయంతో ఈ విషయం చెప్పడానికి భయపడ్డాను. కానీ మన ఫ్యామిలీలో అందరికంటే ముందు ఈ విషయాన్ని చెప్పింది మీకే పెదనాన్న అంటూ చెప్పారు

మరింత సమాచారం తెలుసుకోండి: