టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో సురేందర్ రెడ్డి ఒకరు. ఈయన కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన అతనొక్కడే సినిమాతో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. అద్భుతమైన మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ గా సురేందర్ రెడ్డి "అతనొక్కడే" సినిమాను తెరకెక్కించాడు. ఈ మూవీ సూపర్ సక్సెస్ కావడంతో సురేందర్ రెడ్డి కి అద్భుతమైన గుర్తింపు లభించింది. ఇకపోతే ఈ దర్శకుడు ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో అశోక్ అనే సినిమాను తెరకెక్కించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

ఇక ఆ తర్వాత సురేందర్ రెడ్డి కొంత కాలానికి కిక్ అనే మూవీ ని తెరకెక్కించాడు. మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన ఈ సినిమాలో గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో సురేందర్ రెడ్డి కి మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే ఈ సినిమాకు వక్కంతం వంశీ కథ ను అందించాడు. సురేందర్ రెడ్డి ఈ సినిమాను మొదట రవితేజ తో కాకుండా జూనియర్ ఎన్టీఆర్ తో చేయాలి అనుకున్నాడట.

అందులో భాగంగా సురేందర్ రెడ్డి , ఎన్టీఆర్ ను కలిసి ఈ మూవీ కథను కూడా వివరించాడట. కథ మొత్తం విన్న ఎన్టీఆర్ కి ఈ సినిమా కథ బాగానే ఉంది కానీ నాపై ఈ కథ వర్కౌట్ అవుతుందా అని అనుమానాన్ని వ్యక్తం చేశాడట. అలాగే అప్పటికే వీరి కాంబోలో అశోక్ సినిమా వచ్చి అది ఫ్లాప్ కావడంతో మరోసారి వీరి కాంబో లో సినిమా వస్తుంది అంటే జనాలు ఎలా ఆలోచిస్తారో అనే ఉద్దేశంతో జూనియర్ ఎన్టీఆర్ ఈ కథను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. దానితో సురేందర్ రెడ్డి ఇదే కథను రవితేజ తో కిక్ అనే టైటిల్ తో రూపొందించి అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: