మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన మూవీలలో ఇంద్ర మూవీ ఒకటి. ఇకపోతే బి.గోపాల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ... ఆర్తి అగర్వాల్ , సోనాలి బింద్రే ఈ సినిమాలో చిరుకు జోడిగా నటించారు. ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ సినిమాను మొదట చిరంజీవి తో బి.గోపాల్ వద్దన్నాడు. అసలు ఇంత గొప్ప కథను చిరంజీవి తో బి గోపాల్ ఎందుకు వద్దన్నాడు. ఆ తర్వాత ఈ మూవీ ఎలా సెట్ అయింది అనే వివరాలను తెలుసుకుందాం. మెగాస్టార్ చిరంజీవి హీరోగా అశ్విని దత్ తన బ్యానర్లో ఓ సినిమా చేయడానికి ఫిక్స్ అయ్యాడు.

అందులో భాగంగా బి గోపాల్ ని దర్శకుడిగా ఎంపిక చేసుకున్నాడు. ఆ తర్వాత చిన్ని కృష్ణ దగ్గర ఉన్న కథతో సినిమా చేయాలి అనుకున్నారు. ఇకపోతే ఆ కథ మొత్తం విన్న బి గోపాల్సినిమా చిరంజీవితో వద్దు అనుకున్నాడు. ఆ తర్వాత పరుచూరి గోపాలకృష్ణ ఎందుకు ఈ సినిమాను చేయను అన్నావు అని అడిగాడట. దానితో గోపాల్ నేను ఇప్పటికే బాలకృష్ణ గారితో సమరసింహా రెడ్డి , నరసింహ నాయుడు అనే రెండు ఫ్యాక్షన్ సినిమాలు చేశాను. ఆ సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి.

కాకపోతే మళ్లీ దాదాపు అలాంటి కథతోనే చిరంజీవి తో సినిమా చేస్తే అది ఆడుతుందా ..? ఇప్పటికే నేను చిరంజీవి తో మెకానిక్ అల్లుడు అనే సినిమా చేసి దెబ్బ తిన్నాను. మళ్లీ అలా జరగకూడదు ... అనే ఉద్దేశంతోనే ఆ కథను వద్దన్నాను అని అన్నాడట. దానితో పరుచూరి గోపాలకృష్ణ నువ్వు బాలకృష్ణ తో ఫ్యాక్షన్ సినిమాలు చేశావు. అలాంటి కథతో చిరంజీవి తో సినిమాలు చేయలేదు. కాబట్టి అది వర్కౌట్ అవుతుంది అని చెప్పాడట. దానితో గోపాల్ కూడా ఆయన మాటలకు కన్విన్స్ అయ్యి చిన్న కృష్ణ తయారు చేసిన కథలో కొన్ని మార్పులు , చేర్పులు చేసి ఇంద్ర అనే టైటిల్ తో ఆ మూవీ ని చిరు తో తెరకెక్కించారు. ఇక ఆ సినిమా ఏకంగా ఆ సమయం లో ఇండస్ట్రీ హిట్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: