గత నెల జూలై 27 నుండి బాలీవుడ్ లో వైరల్ అవుతున్న వార్త ఒక్కటే.. అదేంటయ్యా అంటే.. కృతిసనన్ తన కంటే పదేళ్లు చిన్న వయసు వాడైన కబీర్ బహియాతో డేటింగ్ లో ఉండడం.. అంతేకాకుండా వీరిద్దరికీ సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయింది అని బీ టౌన్ లో కొంతమంది చర్చించుకున్నారు.. అయితే ఈ వార్తలు వైరల్ అయ్యి ఇన్ని రోజులు అవుతున్నా కూడా అటు కబీర్ బహియా గానీ ఇటు కృతి సనన్ గాని క్లారిటీ ఇవ్వలేదు. దీంతో వీరి మధ్య ఏదో ఉందని, అందుకే వీళ్ళు నోరు విప్పడం లేదని అందరూ భావించారు.కానీ ఎట్టకేలకు కృతి సనన్ తన డేటింగ్ విషయంపై నోరు విప్పింది. గత కొద్ది రోజుల నుండి సోషల్ మీడియాలో నా పేరు ఎక్కువగా వైరల్ అవుతుంది. మరీ ముఖ్యంగా 34 ఏళ్ల హీరోయిన్ 24 ఏళ్ల అబ్బాయితో డేటింగ్ అంటూ ఒక్క హెడ్డింగ్ ని పదే పదే వాడుతున్నారు.

అసలు ఈ పదం వాడడానికి ఎంత అసహ్యంగా ఉంది. ఇది కేవలం నేను మాత్రమే కాదు నా కుటుంబ సభ్యులు చూసి కూడా బాధపడుతున్నారు.ఒక వ్యక్తి గురించి వ్యక్తిగత విషయాలు రాసేటప్పుడు అందులో ఎంత నిజం ఉంది అబద్ధం ఎంత ఉంది అనేది తెలియకుండానే రాసేస్తారా.. ఒకప్పుడు సోషల్ మీడియా లేకపోవడంతో పేపర్లో వచ్చే దాన్నే అందరూ చర్చించుకునేవారు.కానీ ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులోకి రావడంతో ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు వార్తలు వైరల్ చేస్తున్నారు.ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు నెగిటివ్ కామెంట్లు పెడుతూ లేనివి కూడా ఉన్నట్టు సృష్టిస్తున్నారు. ఎవరికి నచ్చింది వాళ్ళు స్వేచ్ఛగా రాసేసుకుంటున్నారు.

ఇప్పటికే కబీర్ విషయంలో నాకు ఎన్నో మెసేజ్లు,ఫోన్లు వస్తున్నాయి. ఇలాంటి రూమర్ల వల్ల నేను మాత్రమే కాదు నా కుటుంబం కూడా ఇబ్బందులకు గురవుతోంది.ఈ విషయం గురించి నేను పదే పదే క్లారిటీ ఇవ్వడం చాలా విసుగు పుట్టిస్తుంది అంటూ మొదటిసారి కబీర్ బహియాతో వచ్చిన డేటింగ్ వార్తలపై క్లారిటీ ఇచ్చింది కృతి సనన్.. అయితే ఈ వార్తలు రావడానికి కారణం కృతి సనన్ గత కొద్ది రోజులుగా కబీర్ బహియాతో చెట్టాపట్టాలేసుకొని విదేశాల్లో తిరుగుతుందని, అలాగే ఆమె బర్త్డే గ్రీస్ దేశంలో జరుపుకుంటే అక్కడికి కూడా కబీర్ బహియా వచ్చారనే రూమర్స్ వినిపించాయి.అందుకే కబీర్ బహియాతో కృతి డేటింగ్ వార్తలు వైరల్ అయ్యాయి

మరింత సమాచారం తెలుసుకోండి: