ఒక హీరోతో అనుకున్న కథను మరో హీరోతో తెరకెక్కించడం అనేది సినిమా ఇండస్ట్రీలో చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇకపోతే చాలా మందికి నచ్చిన ఓ కథ రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ కు నచ్చలేదు. ఉప్పెన సినిమాతో బుచ్చిబాబు సన దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు , జూనియర్ ఎన్టీఆర్ హీరోగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఓ మూవీ చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కొంత కాలం పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆ సినిమా కథపై ఇంట్రెస్ట్ చూపించి ఆ తర్వాత ఎందుకో దాని నుండి పక్కకు వచ్చేసాడు. ఆ తర్వాత బుచ్చిబాబు , చరణ్ కు ఓ కథను చెప్పడం , దానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం , ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తి కావడం జరిగింది.

మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమా యొక్క రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కాబోతుంది. చాలా మంది జూనియర్ ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన కథతోనే బుచ్చిబాబు , చరణ్ తో సినిమా చేయబోతున్నాడు అని వార్తలు వస్తున్నాయి. నిజంగా జూనియర్ ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన కథతోనే బుచ్చిబాబు , చరణ్ తో సినిమా చేయాలి అనుకున్నట్లు అయితే చరణ్ , బుచ్చిబాబు తో చేయబోయే సినిమా కథను చాలా మంది మెచ్చుకున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోయే శివరాజ్ కుమార్ , బుచ్చిబాబు అద్భుతమైన కథను రాసుకున్నాడు.

అది ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ అవుతుంది అని చెప్పుకొచ్చాడు. ఇక విజయ్ సేతుపతి కూడా బుచ్చిబాబు , చరణ్ తో చేయబోయే సినిమా కథ నాకు తెలుసు. అది అద్భుతంగా ఉంటుంది అని అన్నారు. ఇక ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు. ఈయన కూడా ఈ సినిమా కథ వినే ఈ సినిమాకు సంగీతం అందించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇలా ఎంతో మంది కి నచ్చిన కథ జూనియర్ ఎన్టీఆర్ కి ఎందుకు నచ్చలేదా అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. మరి ఈ సినిమా విడుదల అయిన తర్వాత దాన్ని రిజల్ట్ బట్టి ఎన్టీఆర్ ఎందుకు ఈ సినిమాను రిజెక్ట్ చేశాడు అనేది తెలిసే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: