స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘దేవర’. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అలాగే సైఫ్ అలీఖాన్ విలన్‌గా మెప్పించనున్నాడు. ఇందులో అతిలోక సుందరి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.దేవరతో ఈ అమ్మడు టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతోంది. అయితే ఇప్పటికే దేవర నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ భారీ అంచనాలను పెంచడంతో తారక్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రజెంట్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా రెండు పార్టులుగా రాబోతున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించడంతో.. అందరి దృష్టి దేవర మూవీ పైనే పడింది. అయితే ఈ సినిమా సెప్టెంబర్ 27న వియదశమి కానుకగా థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది.ప్రస్తుతం దేవర పోస్ట్ ప్రొడక్షన్ పనులు అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో.. తాజాగా, ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరిలో ఆసక్తిని పెంచుతోంది. ఆగస్టు 15 రాబోతుంది అలాగే ఆగస్టు 16న సైఫ్ అలీ ఖాన్ పుట్టిన రోజు కూడా ఉండటంతో.. మేకర్స్ అప్డేట్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. దేవర నుంచి సైఫ్ బర్త్‌ డే నాడు ఆయన క్యారెక్టర్‌కు సంబంధించిన వీడియోను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న తారక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.దేవర యూనిట్ ప్రస్తుతం ఆయుధ పూజ అనే హై-వోల్టేజ్ పాటను చిత్రీకరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో ఆయుధం యొక్క అద్భుతమైన చిత్రాన్ని పంచుకున్నారు.ఈ చిత్రంలో తారక్ పొన్నప, శృతి మురాతి, వంశి, శ్రీను, హిమజ కీలక పాత్రలో నటిస్తున్నారు. యువసుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.ఇదిలావుండగా ఈనెల 16న సైఫలీ ఖాన్ బర్తడే ఉండగా ఒకరోజు ముందుగానే స్పెషల్ వీడియోను విడుదల చేస్తున్నట్లు దేవర మూవీ మేకర్ సమాచారం ఇచ్చారు.ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆయన క్యారెక్టర్ ను పరిచయం చేసేలా వీడియో ఉంటుందని తెలుస్తుంది. ఇక దేవర లో ఇటీవల విడుదలైన చుట్టములే సాంగ్ విపరీతంగా ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: