మాస్ మహారాజా రవితేజ, హరీష్ శంకర్ కాంబో మూవీ ‘మిస్టర్ బచ్చన్’ అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ప్రతిష్టాత్మకమైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి.విశ్వ ప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు. మిస్టర్ బచ్చన్ లో రవితేజకు జోడిగా భాగ్యశ్రీ బోర్సే నటించగా ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున విడుదల కానుంది. ఆగస్టు 14 సాయంత్రం నుంచి ప్రిమియర్స్ ఉండబోతున్నాయి. ఈ నేపథ్యంలో డైరెక్టర్ హరీష్ శంకర్ హరీష్ శంకర్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.రవితేజ నటిస్తున్న 'మిస్టర్ బచ్చన్' నిర్మాతలు భాగ్యశ్రీ బోర్స్‌ను మహిళా ప్రధాన పాత్రగా ప్రకటించినప్పటి నుండి ప్రధాన జంట మధ్య వయస్సు అంతరం గురించి లెక్కలేనన్ని ట్రోల్స్ వచ్చాయి. ఆసక్తికరమైన విషయమేమిటంటే, మిస్టర్ బచ్చన్ హీరో మరియు హీరోయిన్ మధ్య పెద్ద వయస్సు గ్యాప్ ఉన్న మొదటి చిత్రం కాదు కానీ ట్రోలర్లు హద్దులు దాటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు ట్రోల్స్‌కు స్టైల్‌గా సమాధానమిచ్చాడు.రీసెంట్ గా మరో యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్స్ విషయంలో కూడా చాలా ట్రోల్స్ పడ్డాయి. ఇలా రవితేజ అండ్ హీరోయిన్స్ విషయంలో నడుస్తున్న కాంట్రవర్సియల్ ట్రోల్స్ పట్ల తాజాగా తన దర్శకుడు హరీష్ శంకర్ అయితే ఆ ట్రోల్స్ చేస్తున్న వారిపై ఫైర్ అయ్యారు. అసలు వారికేం తెలుసని మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. అసలు సినిమాకి వయసుకి సంబంధం ఏముంటుంది అని సినిమాలో హీరో, హీరోయిన్స్ పై స్క్రీన్ ఏజ్ అనేది ఎప్పుడు కరెక్ట్ గానే తీసుకుంటాం. అసలు ఒక హీరో లేదా హీరోయిన్ బయట ఒక ఏజ్ ఉంటే సినిమాలో కూడా ఆ ఏజ్ లోనే కనిపిస్తారని ఎలా అనుకుంటున్నారు? మినిమమ్ కామన్ సెన్స్ లేదేంట్రా మీకు అంటూ ఫైర్ అయ్యారు. అయినా ఒక హీరోయిన్ అన్నీ తెలిసే ఒక సినిమా ఓకే చేసి సంతకం పెట్టినపుడు వాళ్ళకి లేని ప్రాబ్లమ్ మీకేంటి అసలు అసలు అని హరీష్ తన మార్క్ ఫైర్ ఆన్సర్ ఇచ్చారు.


ధమాకా హిట్టయింది కాబట్టి చిన్న పిల్లని పెట్టారు కాబట్టి సక్సెస్ అయ్యింది అని అంటారా? సక్సెస్ అయ్యిన తర్వాత ఏజ్ కోసం మాట్లాడలేదు ఇలా హిట్టయ్యాక ఒక మాట హిట్ కాకపోతే ఒక మాట్లాడ్డం కరెక్ట్ కాదని హరీష్ అయితే ఏజ్ విషయంలో నడుస్తున్న కొన్ని కాంట్రవర్సీలు కొన్ని ట్రోల్స్ పై మాత్రం గట్టి సమాధానం ఇచ్చేసారు. దీంతో ఈ కామెంట్స్ పట్ల రవితేజ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పుడు వీరి కాంబినేషన్ లో వస్తున్న మిస్టర్ బచ్చన్ ఈ ఆగస్ట్ 15న విడుదల కాబోతుంది. ఈ చిత్రాన్ని టిజి విశ్వప్రసాద్ నిర్మాణం వహించారు.తాజాగా ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు ట్రోల్స్‌కు స్టైల్‌గా సమాధానమిచ్చాడు. ఏజ్ గ్యాప్ గురించిన గొడవ నాకు అర్థం కావడం లేదు. మీ ఇంట్లో ఒక అమ్మాయికి పెళ్లి అయిందనుకోండి, మీరు చాలా విషయాలు చూస్తారు. వయోభేదం మాత్రమే కాదు, మీరు వరుడి కుటుంబ నేపథ్యం, జ్యోతిష్యం మరియు ఇలాంటి అనేక విషయాలను ధృవీకరిస్తారు. సినిమా విషయానికి వస్తే మనం మరింత జాగ్రత్తగా ఉండాలి. ఒక నటుడు ఎల్లప్పుడూ అతని/ఆమె వయస్సును పోషించడు. 25 ఏళ్ల మహిళ తన వయస్సు 50 ఏళ్లని మనల్ని నమ్మించాలి. అది నటన. స్క్రీన్ ఏజ్ అని ఒకటి ఉంది. నటికి వయస్సు అంతరంతో ఎలాంటి సమస్య లేదు. అందుకే సినిమాకు సైన్ చేసింది. నటి సౌకర్యంగా ఉన్నప్పుడు కొంతమంది వయస్సు అంతరం గురించి ఎందుకు ఆందోళన చెందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: