నాగచైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ వార్తలు ఒక్కసారిగా వైరల్ గా మారడంతో.. సమంత అభిమానుల సైతం నాగచైతన్య ను శోభితను ఏకీపారేయడం జరిగింది. ఇప్పటికీ వీరి గురించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలోనే సమంత గురించి ఒక షాకింగ్ న్యూస్ వైరల్ గా మారుతోంది. అదేమిటంటే సమంత కూడా ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని ఒక న్యూస్ అయితే వైరల్ గా మారుతున్నది. ప్రముఖ డైరెక్టర్ రాజ్ డీకే తో సమంత గత కొన్నేళ్లుగా డేటింగ్ లో ఉందనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.


సమంతతో కలిసి ది ఫ్యామిలీ మెన్ అనే సిరీస్ ని కూడా చేశారు. ఈ సిరీస్ తర్వాతే నాగచైతన్య తో సమంత విడాకులు తీసుకోవడం కూడా జరిగిందట. ఒక ప్రముఖ నేషనల్ వార్తాపత్రికలో వచ్చిన కథనం ప్రకారం సమంత చాలా కాలం నుంచి ఈ డైరెక్టర్ తో డేటింగ్ చేస్తోందని.. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏమిటంటే  డైరెక్టర్ రాజ్ కు ఇదివరకే వివాహం జరిగిందని కానీ సమంతతో ప్రేమలో పడిన నేపథ్యంలోనే తన మొదటి భార్యకు సైతం విడాకులు ఇవ్వాలని ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


అయితే ఈ ప్రచారం ఎంతవరకు నిజమనేది తెలియదు కానీ ప్రస్తుతం అయితే సమంత డైరెక్టర్ రాజ్ కు ఎంగేజ్మెంట్ అయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి. నాగచైతన్య తో విడాకుల అనంతరం సమంత పుట్టినరోజు వేడుకలకు కూడా ఈ డైరెక్టర్ తమ టీమ్ తో కలిపి చాలా ఘనంగా నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ విషయం  కూడా అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం డైరెక్టర్ రాజ్ డీకే డైరెక్షన్ లోనే సమంత సీటాడేల్, హనీ బన్నీ అనే వెబ్ సిరీస్లలో నటిస్తోందట. ఇవి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రిమింగ్ కి సిద్ధం కాబోతున్నాయి మరి ఈ విషయం పైన సమంత ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: