
విక్రమ్ ‘సేతు’ సినిమాతో మొట్టమొదటి బ్రేక్ అందుకున్నాడు. ఆ తర్వాత అతనికి ఎన్నో సినిమా అవకాశాలు వచ్చాయి. అతను ఎక్కువగా కొత్త రకం సినిమాలు తీస్తుంటాడు కాబట్టి కమర్షియల్ గా అవిపెద్దగా ఆడవు. ఇక విక్రమ్ ఫ్యామిలీ లైఫ్ విషయానికి వస్తే.. చియాన్ విక్రమ్ తన భార్య శైలజా బాలకృష్ణన్‌ను 1980ల చివరలో కలిశాడు. తర్వాత, 1992లో గురువాయూర్ దేవాలయంలో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. అదే సమయంలో వేరే చాలామంది జంటలు కూడా ఇక్కడే పెళ్లి చేసుకున్నారు.
చెన్నైలోని లాయోలా కళాశాల చర్చిలో వీరు మరోసారి పెళ్లి చేసుకున్నారు. శైలజా కేరళలోని తలస్సేరికి చెందినవారు. ప్రస్తుతం చెన్నైలోని ఒక ప్రముఖ పాఠశాలలో సైకాలజీ బోధిస్తున్నారు. 'దైవ తిరుమగల్' సినిమా కోసం శైలజా విక్రమ్‌కు సహాయం చేశారు. ప్రత్యేక అవసరాలున్న వ్యక్తులతో ఎలా ప్రవర్తించాలి అనే విషయంలో తన అనుభవాలను విక్రమ్‌తో పంచుకున్నారు. ఆ సినిమాలో విక్రమ్ పాత్రను అభివృద్ధి చేయడంలో శైలజా సలహాలు చాలా ఉపయోగపడ్డాయి.
విక్రమ్, శైలజ దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొడుకు ధృవ్ తమిళ చిత్రసీమలో హీరోగా అరంగేట్రం చేశారు. ఇప్పుడిప్పుడే కోలీవుడ్ ఇండస్ట్రీలో హిట్స్ అందుకుంటూ స్టార్ డమ్ సంపాదించుకుంటున్నాడు. ఇక విక్రమ్‌కి ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. కూతురు అక్షిత 1993లోనూ, కొడుకు ద్రువ 1997లోనూ జన్మించారు. కూతురు అక్షిత 2017 అక్టోబర్ 30న దివంగత రాజకీయ నాయకుడు కరుణానిధి మనవడు మను రంజిత్ ను పెళ్లి చేసుకుంది. విక్రమ్ చెన్నైలోని బీచ్ రోడ్డు దగ్గర ఉంటారు. ఆయన మరే ఇతర భాషా సినిమాల్లో అవకాశాలు వచ్చినా, చెన్నైలోనే ఉంటానని చెప్పాడు. కొడుకు ధృవ్ 2019లో 'అర్జున్ రెడ్డి'కి రీమేక్‌గా వచ్చిన 'అదిత్య వర్మ' సినిమాతో సినిమా రంగంలోకి అడుగు పెట్టాడు.