కాగా.. శ్రీ వెంకటేశ్వర బ్యానర్లో వస్తున్న 58వ చిత్రాంగా తెరకెక్కుతున్న ఈ మూవీని సంక్రాంతి బరిలోకి దింపుతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దాంతో సంక్రాంతి రేసు రసవత్తరంగా మారింది. ఇందులో వెంకీ పోలీస్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. వెంకీ-అనిల్ కాంబోలో వస్తున్న మూడో చిత్రం కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ కాంబో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్నారు. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసి.. 2025 సంక్రాంతి బరిలో నిలవాలని మేకర్స్ భావిస్తున్నారు. వెంకీతో ఈసారి అనిల్ రావిపూడి గట్టిగానే ప్లాన్ చేశాడని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.అయితే ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ మొదలవ్వగా తాజాగా వెంకటేష్ ఈ కొత్త సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ షూటింగ్ పొల్లాచ్చి లో జరుగుతుంది. వెంకీ మామ తాజాగా సెట్లోకి ఎంటర్ అయ్యారని అనౌన్స్ చేసిన మూవీ టీం దానికి సంబంధించిన వీడియోను రిలీజ్ చేసింది.నేడు వెంకటేష్ – అనిల్ రావిపూడికి మేకింగ్ వీడియోని రిలీజ్ చేస్తూ వెంకటేష్ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు అని ప్రకటించారు. ఇక ఈ మేకింగ్ వీడియోలో వెంకటేష్ లుంగీ, పంచ కట్టి సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమాలో కూడా కామెడీ బాగానే ఉండబోతుందని తెలుస్తుంది.సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు టైటిల్ కూడా ‘సంక్రాంతికి వస్తున్నాం’ అని పెట్టినట్టు టాక్ వినిపిస్తుంది.