మురారి సినిమా రీరిలీజ్ చేశారు కాబట్టి ఈ సందర్భంగా ఆ మూవీని సూపర్ హిట్ చేసిన నటీనటులు, టెక్నిషియన్స్ కూడా తెలుగులో పాల్గొంటూ ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఈ మూవీ తీసిన డైరెక్టర్ కృష్ణవంశీ మురారి సినిమాకు సంబంధించిన చాలా విషయాలను ఆల్రెడీ వెల్లడించాడు. నెటిజన్స్ మూవీకి సంబంధించిన విశేషాలను, అతని విషయాలను కూడా అడుగుతుంటారు సందేహాలు తీర్చాలని కోరుతుంటారు. కృష్ణవంశీ నెటిజన్లు అడిగిన ప్రతి క్వశ్చన్‌కు కూడా చాలా ఓపికగా సమాధానాలు ఇస్తుంటాడు.
తాజాగా నెటిజన్లతో ముచ్చటిస్తూ మురారి షూటింగ్ సమయంలో ఈయన ఒక ధర్నా గురించి క్లారిఫికేషన్ ఇచ్చాడు. ధర్నా గురించి చెప్పండి సార్ అని నెటిజన్ అడగ్గా కృష్ణవంశీ అసలేం జరిగిందో వివరించాడు. మురారి సినిమాకు వర్షం డైరెక్టర్ శోభన్, డైరెక్టర్ నందిని రెడ్డి, లక్ష్యం డైరెక్టర్ శ్రీవాస్ అసిస్టెంట్ డైరెక్టర్లుగా చేసిన సంగతి తెలిసిందే.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నందిని రెడ్డి మురారి షూటింగ్ జరుగుతున్న సమయంలోనే తమ డైరెక్టర్ డిపార్మెంట్ సింగిల్ డే పాటు ధర్నా చేపట్టానని.. షూటింగ్ లో ముఖ్యమైన రోజే ధర్నా స్టార్ట్ చేశామని షాక్ ఇచ్చింది. ఓ నెటిజన్ ట్విట్టర్ వేదికగా దీని గురించి వివరించండి సార్ అని అడిగారు. డైరెక్టర్ కృష్ణవంశీ రిప్లై ఇస్తూ “పనిలో రెస్పాన్సబిలిటీగా లేకపోతే నాకు అసంతృప్తిగా ఉంటుంది. అసిస్టెంట్ డైరెక్టర్లు అనేవాళ్ళు ఫ్యూచర్ డైరెక్టర్లు. వాళ్లు అన్ని చేయగలగాలి, ప్రతిదీ చేయడానికి ఎవర్ రెడీగా ఉండాలి. అప్పట్లో నందిని రెడ్డి వాళ్లు చిన్న పిల్లల లాంటి వాళ్లు కాబట్టి 12-14 గంటల పనిచేసిన తర్వాత చిరాకు వచ్చేస్తుంది. వాళ్ళ బాధ నేను అర్థం చేసుకోగలిగాను కాబట్టి వారిపై నాకు కోపం రాలేదు. ఆ తర్వాత కూడా వాళ్లతో కలిసి వర్క్ చేశా.” అంటూ చెప్పుకొచ్చాడు.