డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరో రామ్ పోతినేని కాంబినేషన్లో వచ్చిన రెండో చిత్రం డబల్ ఇస్మార్ట్ శంకర్ ఈ రోజున ఈ సినిమా రేచర్ల ముందుకి వచ్చింది గతంలో ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సీక్వెల్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ట్రైలర్ మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో పాటుగా ఇందులో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ విలన్ గా కనిపించడంతో హిందీ ఆడియన్స్ కు కూడా ఈ సినిమా ఎక్సైటింగ్ గా అయ్యేలా చేసింది. స్కంద సినిమాతో రామ్ ఫ్లాప్ ని మూట కట్టుకోక పూరీ లైగర్ సినిమాతో దెబ్బ పడింది.. దీంతో ఇద్దరికీ కూడా ఒక సక్సెస్ కావాలి. మరి డబుల్ ఇస్మార్ట్ శంకర్ ఇచ్చిందో లేదో చూద్దాం.

డబుల్ ఈ స్మార్ట్ శంకర్ సినిమాకి ట్విట్టర్ లో కూడా పాజిటివ్ గానే రెస్పాన్స్ లభిస్తోంది. ఇందులో హీరో రామ్ పోతినేనికి జంటగా కావ్య దాపర్ నటించింది. సుమారుగా 162 నిమిషాల నిడివితో ఈ సినిమా ఉన్నది. రామ్ ఎంట్రీ కూడా విభిన్నమైన చిన్న ట్విస్ట్ ఇచ్చేటువంటి ఫైట్ తోనే చాలా స్టైలిష్ గా ఎంట్రీ ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ వరకు నెమ్మదిగానే సాగిన ఈ ఆ తర్వాత రామ్ పోతినేని ఎనర్జీ లెవెల్స్ తో హైలైట్ గా చేస్తూ సన్నివేశాలను తేరకెక్కించి ప్రేక్షకులకు మంచి ట్విస్ట్ ఇచ్చారు డైరెక్టర్ పూరి.


పూరి జగన్నాథ్ ఫుల్ స్ట్రెంత్ పెట్టి మరి ఈ సినిమాని ఈ చిత్రాన్ని చేసినట్టుగా కనిపిస్తోంది. ఓవరాల్ గా ఫస్ట్ అఫ్ బాగానే వర్క్ అవుట్ అయ్యిందని పలువురి నేటిజెన్స్ ట్విట్టర్ల ద్వారా తెలుపుతున్నారు. రెండవ భాగంలో పూరి డైలాగ్స్ మదర్ సెంటిమెంట్ ట్విస్టులతో కూడా వర్కౌట్ అయినట్టుగా కామెంట్స్ చేస్తున్నారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా మణిశర్మ అదరగొట్టేసారనే విధంగా వినిపిస్తున్నాయి. సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ఏదైనా మైనస్ ఉందంటే కేవలం అవి ఆలీ కామెడీ సన్నివేశాలు అంటూ తెలుపుతున్నారు. ఓవరాల్ గా పూరి జగన్నాథ్ చెప్పి మరి హిట్టు కొట్టారంటూ ఆయన అభిమానులు తెలియజేస్తున్నారు. మరి పూర్తి రివ్యూ రావాలి అంటే మరి కొద్ది గంటలు ఆగాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: