ఆమె చాలా పాపులర్ నటి. ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. ఇప్పుడు ఈ అందాల తార వయసు 69 ఏళ్లు. చాలా రోజుల నుంచి ఒంటరిగానే నివసిస్తుంది. ఆమె మరెవరో కాదు బాలీవుడ్ ఎవర్ గ్రీన్ యాక్ట్రెస్ రేఖ. ఈమె కెరీర్ లైఫ్ కంటే పర్సనల్ లైఫ్ చాలా సవాళ్లను ఎదుర్కొంది. ఈ ముద్దుగుమ్మకు వైవాహిక జీవితాన్ని ఆస్వాదించాలని ఎంతో ఆశగా ఉండేది కానీ లైఫ్ పార్ట్నర్స్ ఆమె కోరుకున్నట్లు ఎప్పుడూ ఉండేవారు కాదు. రెండుసార్లు చేసుకొని తన ముచ్చట తీర్చుకుందాం అనుకుంది కానీ నిరాశే ఎదురయింది. చివరికి వైవాహిక జీవితం అనుభవించే అదృష్టం లేదేమో అని ఆమె మరో పెళ్లి చేసుకోలేదు.
రేఖ ఒకసారి తన మ్యారీడ్ లైఫ్ గురించి ఓపెన్ అప్ అయింది. ఆమె చెప్పిన ప్రకారం పెళ్లయిన 6 నెలలకే రేఖ భర్త ముఖేష్ అగర్వాల్ సూసైడ్ చేసుకున్నాడు. అలా ఆమెను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయాడు. దీనికి కూడా రేఖలే తప్పు అని చాలామంది దారుణంగా కామెంట్ చేశారు. బ్లేమ్ చేశారు. అంతే కాదు ఆమెను చాలా అవమానించారు. ముఖేష్ బతికున్నప్పుడు రేఖ నుంచి విడాకులు కోరాడట. రేఖ మాత్రం కలిసే ఉందాం, చిన్న చిన్న సమస్యలు పరిష్కరించుకుందామని నచ్చచెప్పిందట. ముఖేష్ మాత్రం పెద్దగా మాట్లాడేవాడు కాదట. రేఖ తన మొదటి వివాహాన్ని నిలబెట్టుకోవడానికి చాలా ప్రయత్నించింది. లండన్‌లో హనీమూన్ కూడా ప్లాన్ చేసింది. ఇంత చేసినా ముఖేష్ సంతోషంగా ఉండేవాడు కాదు. అందుకే ఆమె దివంగత నటుడు వినోద్ మెహ్రాను పెళ్లి చేసుకుంది.
ఇప్పుడు కూడా ఆమెకు కష్టాలు ఎదురయ్యాయి. కానీ వినోద్ మెహ్రా తల్లికి రేఖ అంటే అసలు ఇష్టం ఉండకపోయేది కాదు. అందుకే ఆమె పెళ్లికి కూడా అంగీకరించలేదు దీని ఫలితంగా వాళ్ళిద్దరూ సీక్రెట్ గా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. వీళ్ళ తమ సంబంధాన్ని ఎప్పుడు బయట పెట్టలేదు. సీక్రెట్ గురించి వాళ్లు మాట్లాడలేదు కానీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళ కారణంగా దాని గురించి బయటకు తెలిసింది. రేఖ వ్యక్తిగత జీవితంలో చాలానే కష్టాలు అనుభవించింది. 2018 తర్వాత సినిమాల్లో నటించడం కూడా మానేసింది. అయితే పెళ్లిళ్లు కాకుండా ఆమెకు అమితాబ్ బచ్చన్‌తో అఫైర్ ఉన్నప్పుడు కూడా వార్తలు వచ్చాయి.