కోలీవుడ్లో ప్రముఖ సింగర్ గా పేరు పొందిన సుచిత్ర ఎప్పుడూ కూడా పలు రకాల కామెంట్స్ చేస్తూనే ఉంటుంది. ముఖ్యంగా సుచీ లీక్స్ తర్వాత ఈమె ఒక్కసారిగా సైలెంట్ అయింది. కానీ గడిచిన కొద్ది రోజుల క్రితం మళ్లీ యాక్టివ్ గా కనిపిస్తూ పలు రకాల వివాదాస్పదమైన కామెంట్స్ చేయడం జరిగింది. ఇటీవల కొద్ది రోజుల క్రితం పలువురు సినీ సెలెబ్రెటీలతో పాటుగా తన మాజీ భర్త కార్తీక్ కుమార్ పైన పలు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది సుచిత్ర. ఈమె తన మాజీ భర్త కార్తీక్ కుమారే కాకుండా, హీరో ధనుష్, బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ సైతా ఈమె గే అంటూ పలు రకాల సంచలన వ్యాఖ్యలు చేసింది.


దీంతో ఆమె మాజీ భర్త కార్తీక్ ఈమె పైన పరువు నష్టం కేసు కూడా వేయడం జరిగింది. కానీ ఇప్పుడు తాజాగా తన మాజీ భర్తకు క్షమాపణలు చెప్పేస్తోంది సింగర్ సుచిత్ర. అందుకు సంబంధించి ఒక వీడియోను కూడా విడుదల చేసింది. తన మాజీ భర్తను గే అని పిలిచినందుకు చాలా బాధపడుతున్నానని.. అతడి కెరియర్ నాశనం చేసే ఉద్దేశం తనకు లేదని అందుకే క్షమాపణలు కోరుతున్నాను కార్తీక్ ఫిర్యాదు చేయడం వల్లే తనకు ఎక్కువగా పోలీసుల నుంచి కాల్స్ వస్తున్నాయి అంటూ తెలియజేసింది సుచిత్ర.


అందుకే తాను చేసిన వ్యాఖ్యల పట్ల కూడా తను బహిరంగంగానే క్షమాపణలు చెబుతున్నానంటూ తెలిపింది. కార్తీక్ మంచి వ్యక్తి అని దీంతో ఈ వివాదానికి ఇక ముగింపు పలకాలనుకుంటున్నాను అంటూ ఒక వీడియో ద్వారా తెలియజేసింది. కానీ ఆ వెంటనే వీడియోను కూడా డిలీట్ చేయడం జరిగింది సుచిత్ర. ప్రస్తుతం సుచిత్ర చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. గతంలో కూడా కోలీవుడ్లో సుచిత్ర లీక్స్ ఒక సంచలనంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: