IFFM 17వ ఉత్సవానికి హాజరుకావాలని ఇటీవల ఫీలింగ్ ఫెస్టివల్ నిర్వాహకులు రామ్ చరణ్ కు సైతం ఆహ్వానాన్ని పంపించారట. ఈ చలనచిత్ర ఉత్సవంలో రాంచరణ్ కి నిర్వాహకులు ఇండియన్ ఆర్ట్ కల్చర్ అంబాసిడర్ అనే బిరుదును కూడా ఇవ్వబోతున్నారట. తద్వారా భారతదేశంలో ఎక్స్పెషల్లీ తెలుగు రాష్ట్రాలలో తెలుగు నటులలో ఇలాంటి అరుదైన గౌరవం లభించినటువంటి నటుడిగా ఏకైక నటుడుగా పేరు పొందుతారు రామ్ చరణ్ అని తెలుస్తోంది. ఇప్పటిదాకా కూడా అలాంటి ఒక పురస్కారాన్ని గౌరవాన్ని సైతం రామ్ చరణ్ అందుకోబోతున్నారు.
ఈ విషయం తెలిసి అభిమానులైతే ఫుల్ ఖుషి గా ఉన్నారు. రామ్ చరణ్ చిత్రాల విషయానికి వస్తే డైరెక్టర్ శంకర్ తో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తూ ఉండగా ఈ సినిమా షూటింగ్ ఇంకా జరుగుతూనే ఉంది. ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్లు కూడా కొంతమేరకు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం అయిపోగానే డైరెక్టర్ బుచ్చిబాబుతో RC -16 సినిమాని చేయబోతున్నారు ఇందులో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్నది. rrr చిత్రం తర్వాత మరే సినిమాని కూడా విడుదల చేయలేదు రామ్ చరణ్. దీంతో అభిమానులు కాస్త నిరాశతో ఉన్నప్పటికీ గేమ్ చేంజర్ సినిమా మీద ఆశలు పెట్టుకున్నారు.