నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. నాని నటించిన దసరా, హాయ్ నాన్న సినిమాల దర్శకులు ఫిల్మ్ ఫేర్ బెస్ట్ డెబ్యూ డైరక్టర్లుగా అవార్డులు అందుకోవడంతో పాటు, దసరా చిత్రంలో అద్భుత నటనకు నాని బెస్ట్ హీరోగా అవార్డు అందుకుని ఆ ప్రౌడ్ మూమెంట్ ని ఎంజాయ్ చేస్తున్నాడు.ప్ర‌స్తుతం స‌రిపోదా శ‌నివారం మూవీ షూటింగ్‌తో నాని బిజీగా ఉన్నాడు. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్నీ సినిమాకు వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. అంటే సుంద‌రానికి త‌ర్వాత నాని, వివేక్ ఆత్రేయ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న మూవీ ఇది. ఈ సినిమాలో ప్రియాంక మోహ‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. గ‌తంలో నాని, ప్రియాంక మోహ‌న్ క‌లిసి గ్యాంగ్‌లీడ‌ర్ మూవీలో జంట‌గా క‌నిపించారు.టాలీవుడ్ నటుడు నాని, ప్రియాంక మోహన్ ప్రధాన పాత్రల్లో, దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ సరిపోదా శనివారం. నాని మరో డిఫెరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. ఆగస్టు 29 వ తేదీన వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఈ చిత్రం నుండి మేకర్స్ ట్రైలర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. 24 గంటల్లో 14 మిలియన్స్ కు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్ లో టాప్ లో ట్రెండ్ అవుతోంది. జేక్స్ బెజోయ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో విలక్షణ నటుడు ఎస్.జే. సూర్య కీలక పాత్రలో నటిస్తున్నాడు.ఇదిలావుండగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గురువారం యూసఫ్‌గూడలోని బెటాలియన్‌లో శిక్షణ పొందుతున్న వారితో ‘నేచురల్ స్టార్’ నాని ముచ్చటించారు.ట్రైనీ కానిస్టేబుళ్లు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు.మీరు ఎప్పుడు పోలీసు పాత్రలో నటిస్తారు? అనే ప్రశ్నకు.. ‘ఆ విషయాన్ని ఇప్పటివరకూ ఎక్కడా చెప్పలేదు. ఇదే సరైన వేదిక అని అనుకుంటున్నా. నా కొత్త సినిమా సరిపోదా శనివారం ఆగష్టు 29న అవుతోంది. మరికొన్ని రోజుల్లోనే నా తదుపరి ప్రాజెక్టు ప్రకటిస్తా. అందులోనే నేను పోలీసు ఆఫీసర్‌గా నటించబోతున్నా’ అని నేచురల్ స్టార్ చెప్పుకొచ్చారు.ఈ నేపథ్యం లో తాను ఒకవేళ యాక్టర్ కాకపోయి ఉంటే థియేటర్లలో ప్రొజెక్టర్ ఆపరేటర్ గా పని చేసే వాడిని నా హీరో నాని అన్నారు. తాను డైట్ ఫాలో కానని అమ్మ వండిన ప్రతిదీ తింటానని చెప్పారు. సరిపోదా శనివారం తర్వాత చేయబోయే ప్రాజెక్టులో పోలీసుగా నటించబోతున్నట్లు తెలిపారు. ఫ్రీడమ్ ఫైటర్ బయోపిక్ నేపథ్యంలో మంచి స్క్రిప్ట్ వస్తే తాను నటిస్తానని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: