మన స్టార్ హీరోల అభిమానులు సినిమాల కోసం ఈగర్ గా ఎదురు చూస్తూ ఉంటారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న 'దేవర ' సినిమా కోసం అతని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూడడమే కాకుండా ఈ సినిమా భారీ రికార్డులను క్రియేట్ చేస్తే చూసి ఆనందపడాలని అనుకుంటున్నారు.మరి అందులో భాగంగానే ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్లైతే వైరల్ అవుతున్నాయి. ఇక సినిమా యూనిట్ కూడా ట్రైలర్ మీద చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.ఆగస్టు చివరి వారంలో ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేసి సినిమా మీద అమాంతం అంచనాలను భారీ స్థాయిలో పెంచే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక పాన్ ఇండియా వైడ్ గా వస్తున్న ఈ సినిమా మీద తెలుగులో మంచి అంచనాలు ఉన్నాయి. అలాగే బాలీవుడ్ లో కూడా దీనిమీద మంచి అంచనాలను పెంచాలంటే మాత్రం ఇప్పుడు ప్రమోషన్స్ విపరీతంగా చేపట్టాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఈ సినిమా రిలీజ్ కి మరొక 40 రోజులు మాత్రమే మిగిలి ఉండడం వల్ల ఇక ఇప్పటినుంచి ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అంటు సినిమా యూనిట్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక అందులో బాగంగానే ట్రైలర్ ని రిలీజ్ చేసి ఇక ఆ తర్వాత నుంచి సినిమా మేకర్స్ కూడా ఇంటర్వ్యూలు, ఈవెంట్స్ ని ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది… ఇక కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా మంచి విజయాన్ని సాధించింది. అందులో స్టైలిష్ క్యారెక్టర్ లో నటించిన ఎన్టీఆర్ ఈ సినిమాలో కూడా ఒక మాస్ పాత్రలో కనిపించబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇంతకు ముందు టీజర్ లో రిలీజ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ ని మనం చూసినట్లయితే ఇది మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇక ఇదిలా ఉంటే జాన్వీ కపూర్ కూడా ఈ సినిమా కోసం తన పూర్తి ఎఫర్ట్ ని పెట్టి నటిస్తున్నట్టుగా తెలుస్తుంది. తన క్యారెక్టర్ కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉన్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఈ ఒక్క సినిమాతో అటు గ్లామర్ పాత్రలో కానీ, ఇటు నటిగా కానీ మంచి గుర్తింపును సంపాదించుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది…ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటుడు సైఫాలీ ఖాన్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి అప్డేట్ రాబోతుంది. ఈరోజు సాయంత్రం 4.05 గంటలకు 'భైర' కు సంబంధించిన గ్లిమ్స్ వీడియోను రిలీజ్ చేస్తామని మేకప్స్ ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ జాన్వి కపూర్ హీరో హీరోయిన్ గా నటిస్తుండగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న దేవర సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: