సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బిజినెస్ మెన్ సినిమా గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు.మహేష్ బాబు కెరీర్ లోనే ఇది ఒక స్టైలిష్ సినిమా అని చెప్పాలి.సూర్య అంటే పేరు కాదు ఒక బ్రాండ్ అంటూ సినిమాలో మహేష్ బాబు డైలాగులు, ఫైట్లు సినిమాకు హైలైట్ గా నిలిచాయి.ఈ సినిమాకి పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించారు.ఈ సినిమాలో మహేష్ బాబు కొత్త లుక్ లో, గ్యాంగస్టర్ గా కనిపించారు.ఈ సినిమాలో మహేష్ బాబుకి జోడిగా కాజల్ నటించింది.ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందించాడు.మహేష్ బాబు కెరీర్ లో బిజినెస్ మెన్ ఒక మర్చిపోలేని సినిమా అని చెప్పొచ్చు.సినిమా మొత్తం ముంబై మీదే జరుగుతుంది.అయితే ఈ సినిమాను మహేష్ బాబు కంటే ముందు మరో హీరోని అనుకున్నారు.ఆ హీరో ఎవరో కాదు.సూర్య అవును ముందు ఈ సినిమాని సూర్యతోనే ప్లాన్ చేసారు.కానీ సూర్యకి డేట్స్ సెట్ కాకపోవడంతో ఈ సినిమాను మిస్ చేసుకున్నాడు.ఆ తరువాత ఈ కథ మహేష్ బాబు దగ్గరికి వచ్చింది.మహేష్ కి కథ నచ్చడంతో వెంటనే సినిమాని తీసేసారు.అంతేకాదు ఈ సినిమాలో పిల్లా చావో అంటూ ఒక పాత ఉంటుంది.అయితే బెల్లా సియవు అనే పాప్ ఇటాలియన్ పాటను బిజినెస్ మెన్ సినిమాలో పిల్లా చావో అంటూ తీశారు.ఏనేపథ్యం లో ఆ సినిమా చేయొద్దంటూ పూరిని, ఆర్జీవి హెచ్చరించాడట. అవివరాలు ఇలా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కి స్టార్ హీరోల రేంజ్ లో ఫ్యాన్స్ ఉన్నారు.

పూరి జగన్నాధ్ తెరకెక్కించిన చిత్రాలు కావచ్చు, తెరకెక్కించిన విధానం కావచ్చు, ఆయన బిహేవియర్ కావచ్చు.. కారణం ఏదైనా పూరి విశేషంగా అభిమానులని సొంతం చేసుకున్నారు. పూరి జగన్నాధ్ కి నిర్మాతల ఫ్రెండ్లీ డైరెక్టర్ అనే ఇమేజ్ ఉంది. తాజాగా పూరి జగన్నాధ్ నుంచి వచ్చిన డబుల్ ఇస్మార్ట్ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రానికి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. అయితే పూరి జగన్నాధ్ గత చిత్రాల గురించి విశేషాలు వైరల్ అవుతున్నాయి. పూరి జగన్నాధ్ మేకింగ్ స్టైల్ కి రామ్ గోపాల్ వర్మ, వివి వినాయక్ లాంటి దర్శకులు అభిమానులుగా ఉన్నారు. ముఖ్యంగా ఆర్జీవీకి పూరి అంటే చాలా ఇష్టం. తాను సిద్ధం చేసే కథలని పూరి వర్మతో షేర్ చేస్తుంటారట. అయితే ఒక చిత్రం విషయంలో రామ్ గోపాల్ వర్మ.. పూరి జగన్నాధ్ ని హెచ్చరించారు.ఈ చిత్రం చేయొద్దు.. ఒకసారి చూసుకో అని వార్నింగ్ ఇచ్చారట. ఆ సినిమా ఏదో కాదు.. సూపర్ స్టార్ మహేష్ బాబుతో పోకిరి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత తెరకెక్కించిన బిజినెస్ మాన్ చిత్రం.మహేష్ బాబుతో సినిమా ఒకే అయింది. 70 రోజుల్లోనే షూటింగ్ పూర్తవుతుంది. షూటింగ్ ప్రారంభం కాకముందే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశాం అని పూరి జగన్నాధ్ వర్మకి చెప్పారట. అయితే కథ విన్న రామ్ గోపాల్ వర్మ..నువ్వు పక్కాగా ఉన్నావా.. దయచేసి కంగారు పడి ఈ చిత్రాన్ని చేయొద్దు. కాస్త చెక్ చేసుకో అని సలహా ఇచ్చారట. ఎందుకంటే వర్మకి ఈ చిత్రం హిట్ అవుతుందనే నమ్మకం లేదట. కానీ పూరి మాత్రం కాన్ఫిడెన్స్ తో ముందుకు వెళ్లి ముందుగా అనుకున్నట్లుగానే 70 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసి సూపర్ హిట్ కొట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: