మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతగానో ఎదురుచూసే బర్తడే ఆగస్టు 22వ తేదీన రాబోతోంది. చిరంజీవి బర్తడే ని మెగా అభిమానులు ఒక పండుగలా చేసుకుంటూ ఉంటారు.రెండు తెలుగు రాష్ట్రాలలో చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా పలుసేవ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈసారి పుట్టినరోజు విషయం పైన చిరంజీవి ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం అభిమానులను కాస్త నిరాశ పలిచినప్పటికీ.. కానీ చిరంజీవి తీసుకున్న నిర్ణయంతో మరికొంతమంది ప్రశంసిస్తున్నారు ఆ నిర్ణయంతో ఇప్పుడు ఒకసారి చూద్దాం.



ఈసారి చిరంజీవి 69వ బర్తడే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన బర్తడే అని గ్రాండ్గా చేయవద్దని చెప్పి అభిమానులను నిరాశపరిచారు.. అలాగే తీసుకుని నిర్ణయం వెనుక కారణమేమిటంటే వయనాడ్ విలయం వల్ల చాలామంది మరణించారు. అందుకే ఈసారి తన పుట్టినరోజును ఎలాంటి హంగామా చేయకూడదని అభిమానులకు విన్నవించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. వాయనాడ్ విపత్తు వల్ల ఎలాంటి సెలబ్రేషన్స్ వద్దని కూడా తెలియజేశారు. ఈ విపత్తు నుంచి తమ వంతు సహాయంగా చిరంజీవి కేరళ కి వెళ్లి మరి అక్కడ కోటి రూపాయలు ఆర్థిక సహాయం కూడా అందించారు.


అక్కడ బాధితులను చూసి చలించిపోయినట్లుగా కూడా తాను తెలియజేశారు. అందుకే మనుషులందరూ కష్టాలలో ఉన్నప్పుడు మనం ఇలాంటి సంబరాలు చేసుకోకపోవడమే మంచిదని నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది చిరంజీవి. అయితే సెలబ్రేషన్స్ వద్దన్న చిరంజీవి కేవలం రక్తదాన శిబిరాలు అన్నదాన కార్యక్రమాలు వంటివి చేయాలని తెలియజేశారట. అయితే ఇలాంటి నిర్ణయం తీసుకున్న వెనుక ఆయన గొప్ప మనసుని మెగా అభిమానులు కూడా అర్థం చేసుకొని మరి సేవా కార్యక్రమాలు ఒక్కటే చేస్తారేమో చూడాలి. మరి చిరంజీవి అడుగుజాడల్లోనే చాలామంది సెలబ్రిటీలు కూడా అడుగులు వేసేలా  కనిపిస్తున్నారు. చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర అనే చిత్రంలో నటిస్తూ ఉన్నారు. ఈ మూవీని డైరెక్టర్ వశిష్ట దర్శకత్వం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: