ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వచ్చి ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన కల్కి 2898 ఏడీ మూవీ ఓటీటీలోకి ఎప్పుడొస్తుందో అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. సెప్టెంబర్ లోగానీ ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ ఉండబోదని మొదట్లో భావించారు. థియేటర్ రిలీజ్ తర్వాత పది వారాలకే మూవీని ఓటీటీలోకి తీసుకురావాలన్న ఒప్పందం ఉంది. అయితే తాజాగా వస్తున్న వార్తల ప్రకారం..కల్కి 2898 ఏడీ మూవీ రెండు ఓటీటీల్లోకి రానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రానుండగా.. హిందీ వెర్షన్ మాత్రం నెట్‌ఫ్లిక్స్ లో అడుగుపెట్టనుంది.ఈ ఏడాదిలో ఇండియన్ సినిమా దగ్గర బాక్సాఫీస్ ని షేక్ చేసిన భారీ చిత్రాల్లో మన తెలుగు సినిమాలు మరోసారి ముఖ్య పాత్ర పోషించాయి. కాగా ఏడాది ఆరంభం జనవరిలో "హను మాన్" చూసుకుంటే మొదటి ప్రథమార్ధం జూన్ నెల ముగిసే సరికి కర్ణుడు చూసుకున్నాడని చెప్పాలి. కాగా ఈ ఏడాది జూన్ లాస్ట్ లో వచ్చిన సెన్సేషనల్ హిట్ సినిమానే "కల్కి 2898 ఎడి".కాగా బాక్సాఫీస్ దగ్గర ఇలా వండర్స్ సెట్ చేసిన ఈ సినిమా ఓటిటి రిలీజ్ విషయంలో మేకర్స్ అయితే ముందే ఓ క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రం అన్ని సినిమాల్లా నెల రోజుల్లో ఓటిటిలోకి రాదనీ ముందే నొక్కి చెప్పారు. కాగా అనుకున్నట్టే ఈ సినిమాని థియేటర్స్ లోనే 50 రోజలకి పైగా సక్సెస్ ఫుల్ రన్ అయ్యేలా చూసారు. కాగా ఈ 50 రోజుల తర్వాత డెఫినెట్ గా ఓటిటి డేట్ ఏంటి ఎప్పుడు అనే అప్డేట్స్ వస్తాయి అని టాక్ వచ్చింది.

ఇప్పుడు అనుకున్నట్టుగానే ఈ డేట్ వచ్చేసింది. కాగా ఈ చిత్రాన్ని మొత్తం రెండు ఓటిటి ప్లాట్ ఫామ్ లు సొంతం చేసుకున్న తెలిసిందే. సౌత్ భాషలకి గాను పాపులర్ స్ట్రీమింగ్ యాప్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకోగా హిందీలో నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. మరి ఇప్పుడు సౌత్ భాషల్లో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే దానిపై ప్రైమ్ వీడియో అప్డేట్ ఇచ్చేసారు.
దీనితో ఈ చిత్రం ఈ ఆగస్ట్ 22 నుంచి కల్కి ఓటిటిలో అందుబాటులోకి వస్తుంది అని ఫిక్స్ చేసేసారు. గత కొన్ని రోజులు నుంచి ఈ చిత్రం ఆగస్ట్ 23న వస్తుంది అని స్ట్రాంగ్ రూమర్స్ వినిపించాయి. కానీ ఈ చిత్రం అంతకు ఒక రోజు ముందే బ్లాస్ట్ అవ్వడానికి వచ్చేస్తుంది అని చెప్పాలి. మొత్తానికి అయితే ఈ సినిమా ఓటిటి రిలీజ్ కోసం చూస్తున్నవారికి అమెజాన్ ప్రైమ్ వీడియో వారు పొద్దున్నే చెవిలో తేనే పోసినట్టుగా సాలిడ్ అప్డేట్ అందించారని చెప్పాలి.కాగా ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ లో సీనియర్ హీరోస్ ఉలగనయగన్ కమల్ హాసన్ అలాగే అమితాబ్ బచ్చన్ ఇంకా లేడీస్, దీపికా పదుకొనె, దిశా పటాని, మృణాల్ ఠాకూర్, మాళవిక నైర్, యంగ్ హీరోస్ దుల్కర్ సల్మాన్ అలాగే విజయ్ దేవరకొండలు కీలక పాత్రల్లో నటించగా దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ లాంటి వారు కూడా ఈ చిత్రంలో కనిపించారు. ఇలా ఎంతోమంది స్టార్ కాస్ట్ సమాహారంతో వచ్చిన ఈ సినిమాని భారీ బడ్జెట్ తో వైజయంతి మూవీస్ వారు నిర్మాణం వహించారు. అలాగే రానున్న రోజుల్లో కల్కి యూనివర్స్ నుంచి మరిన్ని భారీ చిత్రాలు రానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: