నేషనల్‌ ఫిల్మ్‌, దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డులను కేంద్రం ప్రకటించింది. హీరో నిఖిల్‌ నటించిన కార్తికేయ-2ను జాతీయ అవార్డు వరించింది. బెస్ట్‌ తెలుగు రీజినల్‌ మూవీగా ఈ చిత్రం నిలిచింది. ఉత్తమ నటుడిగా రిషబ్‌ శెట్టికి జాతీయ అవార్డు లభించింది. కాంతార సినిమాలో ఆయన నటనకుగానూ ఈ అవార్డు దక్కింది. అలాగే ఉత్తమ నటి అవార్డు నిత్యా మేనన్‌ (తిరుచిత్రమ్‌బలం), మానసి పరేఖ్‌ (కచ్‌ ఎక్స్‌ప్రెస్‌) ఇద్దరినీ వరించింది. బెస్ట్‌ డైరెక్టర్‌గా 'ఉంచాయ్‌' సినిమాకి సూరజ్‌ అవార్డ్‌ అందుకోనున్నారు. 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతల పూర్తి జాబితాను ఈరోజు ఆగస్టు 16న ప్రకటించారు. విజేతలకు అక్టోబర్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులు అందిస్తారు. కాగా పుష్ప మూవీలో నటనకుగానూ అల్లు అర్జున్‌ను గతేడాది జాతీయ అవార్డు వరించింది.
జాతీయ చలనచిత్ర అవార్డులను శుక్రవారం అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. మరి ఇందులో ఉత్తమ నటుడిగా ప్రముఖ కన్నడ నటుడు రిషబ్ శెట్టి తన మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మన్స్ కి గాను కాంతారా చిత్రానికి అవార్డును అందుకున్నారు. దీంతో ఆ అవార్డుకు తను తగినవాడే అంటూ అందరూ ప్రశంసలు కురిపించారు. మరి లేటెస్ట్ గా ఈ అవార్డు గెలిచిన తర్వాత రిషబ్ ఒక ఎమోషనల్ నోట్ విడుదల చేశారు. తను జాతీయ అవార్డు గెలుచుకోవడం ఎంతో ఆనందంగా భావిస్తున్నాను అని అలాగే తనతో ఈ ప్రయాణంలో భాగం అయిన అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అంటూ తెలిపారు. అలాగే తనకి వచ్చిన ఈ అవార్డును తన రాష్ట్రంలో దేవ నర్తకులకి అలాగే దివంగత హీరో పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గారికి అంకితం చేస్తున్నాను అంటూ తెలిపారు. ఇప్పుడు తన ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.సెప్టెంబర్ 30న కర్ణాటక రాష్ట్రంలో 250 థియేటర్లలో విడుదలై కాంతారా మూవీ సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు. ఆ తర్వాత ఇతర భాషల్లో కాంతారా మూవీ డబ్ అయ్యి ఇతర భాషల్లో సైతం హిట్ గా నిలిచింది. కేవలం రూ.16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది అంటే ఈ సినిమా ప్రేక్షకులకు ఏ స్థాయిలో నచ్చిందో అర్థం చేసుకోవచ్చు. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అభిమానులకు బాగా నచ్చింది. కేంద్రం 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించగా ఉత్తమ నటుడి పురస్కారం కాంతారా సినిమాకు గాను రిషబ్ శెట్టికి దక్కింది. రిషబ్ శెట్టికి జాతీయ అవార్డు దక్కడం సినీ అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: