- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) .

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్‌లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేశారు. టాలీవుడ్ లో టాప్ హీరోగా ఎదిగారు. చిరంజీవి 10 ఏళ్ల తర్వాత సినిమాలో ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీయంట్రి ఇచ్చి కూడా సూపర్ హిట్ కొట్టారు. తర్వాత కూడా చిరంజీవి వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చి 47 ఏళ్ళు అవుతుంది. జూనియర్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి .. ఆ తర్వాత విలన్ గా, ఆ తర్వాత హీరోగా, ఆ తర్వాత తిరుగులేని మెగాస్టార్ గా ఎన్నో మలుపులు తిరుగుతూ టాలీవుడ్ ను శాసించే స్థాయికి చిరంజీవి ఎదిగారు.

చిరంజీవి కెరీ,ర్‌లో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలతో పాటు.. కొన్ని ఫ్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. చిరంజీవి కెరీర్లో ఒక సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుని.. రిలీజ్ కాకుండా ఆగిపోయింది. ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అయితే షూటింగ్ దశలోనో.. లేక సగం షూటింగ్ అయిపోయాక.. ఆ సినిమా ఆగలేదు. షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్స్ వరకు కూడా పూర్తి అయ్యాక రిలీజ్ దగ్గరికి వచ్చేసరికి ఆగిపోయింది.

సినిమా పేరు శాంతి నివాసం. చిరంజీవి, మాధవి హీరో హీరోయిన్లుగా.. బాబు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఈ సినిమా రిలీజ్ మాత్రం జరగలేదు. ఈ సినిమా ఆగిపోవడానికి కారణం నిర్మాత. త్వరలో శాంతినివాసం రిలీజ్ అవుతుంది అనగా.. సినిమా నిర్మాత హఠాత్తుగా మరణించారు. అనంతరం సినిమా రిలీజ్ చేయాలని అనుకున్న ఆ కుటుంబానికి చెందినవారు.. శాంతినివాసంను రిలీజ్ చేసేందుకు ఇష్టపడలేదు. షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యాక కూడా మధ్యలో ఆగిపోయిన సినిమాగా శాంతినివాసం చరిత్రలో నిలిచిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: