బాలీవుడ్ కింగ్ ఖాన్ గా పేరు గాంచిన షారుక్ ఖాన్ ఓ హీరోయిన్ పై అసభ్యకర కామెంట్లు చేశారు  పబ్లిక్ గా లైవ్ లో ఉండగానే మిమ్మల్ని ప్రెగ్నెంట్ చేస్తా అంటూ షారుక్ ఖాన్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి. మరి ఇంతకీ షారుఖ్ ఖాన్ ప్రెగ్నెంట్ చేస్తా అని ఏ హీరోయిన్ తో అన్నారు ..ఎందుకు అలాంటి మాటలు అన్నారు అనేది ఇప్పుడు చూద్దాం.. జవాన్ మూవీ తో సౌత్ డైరెక్టర్ అట్లీతో వర్క్ చేసి సౌత్ ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు షారుక్ ఖాన్.అలాంటి ఈయన ఎన్నో హిట్ సినిమాలతో బాలీవుడ్ కింగ్ ఖాన్ గా మారిపోయారు . ఇక గత ఏడాది బాలీవుడ్ మొత్తం ఫ్లాపుల్లో ఉన్న సమయంలో ఈయన నటించిన జవాన్,పఠాన్ వంటి సినిమాలు బాలీవుడ్ ఇండస్ట్రీని నిలబెట్టాయని చెప్పుకోవచ్చు. అయితే అలాంటి ఈ హీరోహీరోయిన్ చేసిన ఇంటర్వ్యూలో పాల్గొని ఆ హీరోయిన్ పై వివాదాస్పద కామెంట్లు చేశారు. 

ఇక విషయంలోకి వెళ్తే..బాలీవుడ్ నటి ప్రీతిజింతా అంటే తెలుగు ప్రేక్షకులకు కూడా తెలిసిన హీరోయిన్. ఈమె తెలుగులో వెంకటేష్, మహేష్ బాబువంటి హీరోలతో కూడా జత కట్టింది. అయితే ఈ ముద్దుగుమ్మ తెలుగులో కంటే హిందీలోనే ఫేమస్ నటి..అలా హిందీలో ఎంతోమంది అగ్ర కథానాయకులతో నటించింది. ఇక ప్రీతిజింతా షారుఖ్ ఖాన్ కాంబినేషన్లో కూడా కొన్ని సినిమాలు వచ్చాయి.వీరి ఆన్ స్క్రీన్  కెమిస్ట్రీ బాగుండడంతో వీరికి కాంబోలో వచ్చిన సినిమాలు హిట్ అయ్యాయి. అయితే ప్రీతిజింతా హోస్టుగా చేసిన ఓ ప్రోగ్రాం కి షారుక్ ఖాన్ గెస్ట్ గా వచ్చారు.ఇక ఆ టైంలో షారుఖ్ ఖాన్ పబ్లిక్ గా లైవ్ లోనే నువ్వు ప్రెగ్నెంటా అని అడిగాడు. దానికి ప్రీతి జింతా ఒక సెకండ్ షాక్ లోకి వెళ్లిపోయి ఆ తర్వాత నవ్వుతుంది.

కానీ మళ్ళీ అదే విషయాన్ని కంటిన్యూ చేస్తూ..మిమ్మల్ని నేను ప్రెగ్నెంట్ చేస్తాను అంటూ షారుక్ ఖాన్ మాట్లాడారు.అయితే ఈ వీడియో పాతదే అయినప్పటికీ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవ్వడంతో షారుక్ ఖాన్ మాటలు అసభ్యకరంగా ఉన్నాయని,ఆయన మాట్లాడిన మాటలు ప్రీతి జింతాకు అసౌకర్యాన్ని కలిగించాయని ఆమెను చూస్తేనే అర్థమవుతుంది.అంతపెద్ద హీరో ఇలాంటి మాటలు ఎలా మాట్లాడుతారు అంటూ నెటిజెన్స్ షాకింగ్ కామెంట్లు పెడుతున్నారు. అయితే గతంలో జరిగిన ఈ ఈ షో కి సంబంధించి ఈ చిన్న బిట్ నెట్టింట్లో వైరల్ అవ్వడంతో షారుక్ ఖాన్ పై చాలా మంది నెటిజన్స్ నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: