ఇటీవల కాలంలో చాలా సినిమాలు థియేటర్లో విడుదలై బాగున్నది అంటేనే ప్రేక్షకులు చూడడానికి మక్కువ చూపిస్తున్నారు. లేకపోతే థియేటర్లో విడుదలయ్యే చిత్రాలకు పెద్దగా ఆదరణ లభించడం లేదు. ముఖ్యంగా థియేటర్లకి వచ్చి చూసే వారి సంఖ్య కూడా రోజురోజుకి తగ్గిపోతూనే ఉంది. అందుకు చాలానే కారణాలు ఉన్నాయని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా ఇలాంటి కారణాల పై చాలామంది నిర్మాతలు సైతం చర్చించినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండానే పోయిందట. థియేటర్లకు ప్రేక్షకులు రాకపోవడానికి ముఖ్య కారణం టికెట్లు రేట్లు అధికంగా ఉంచడమే.

భారీ స్థాయిలో సినిమా టికెట్ల రేటు పెంచడంతో సామాన్యుల సైతం కుటుంబంతో వెళ్లే పరిస్థితులు ఎక్కడ కనిపించడం లేదు. అందుకే చాలామంది తిరిగి ఓటీటిలలో సినిమాలను చూడడానికి మక్కువ చూపుతున్నారు. ఇలా ఓటీటీ వచ్చినప్పటినుంచి బుల్లితెర పైన ప్రసారమయ్యే సినిమాలకు దారుణమైన టిఆర్పి రేటింగ్ వస్తున్నాయని వీటి వల్ల శాటిలైట్ రైట్స్ కూడా పెద్దగా పోలేదని వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఈ విషయం పైన తాజాగా దిల్ రాజు మాట్లాడుతూ వాళ్ళ విషయాలను తెలిపారు.


ఇందులో భాగంగా దిల్ రాజు మాట్లాడుతూ.. రేవు అనే సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ..చిన్న సినిమా అని థియేటర్ కి రాకుండా ఎవరూ ఉండవద్దు ప్రతి ఒక్కరు కూడా థియేటర్లో సినిమాని చూడాలని తెలిపారు. అంతేకాకుండా మిమ్మల్ని థియేటర్లకు రాకుండా చేసింది కూడా మేమే అంటూ తెలియజేశారు. థియేటర్లో విడుదలైన సినిమాని చూసేకి రమ్మని చెప్పకుండానే మరి కొద్ది రోజులలో ఓటీటి లో విడుదలవుతుంది.. ఇంట్లోనే కూర్చొని చూడండని మేము చెప్పడం వల్లే అటు చిన్న సినిమాలు పెద్ద సినిమాలు ఆదరణ తగ్గిపోయింది అంటూ తెలియజేశారు. టికెట్ల రేట్లు అధికంగా ఉండడం వల్ల, అలాగే థియేటర్లో కూడా పాప్ కార్న్ వంటి వాటికి అధిక రేట్లు ఉండడం వల్లే చాలామంది థియేటర్లకు రావడానికి భయపడుతున్నారని తెలిపారు. ఏది ఏమైనా ఎట్టకేలకు సినీ ఇండస్ట్రీలో వారందరూ చేసినటువంటి వాక్యాల వల్లే ఇప్పుడు చిక్కుల్లో పడ్డామని ఒప్పుకుంటున్నారు దిల్ రాజ్..

మరింత సమాచారం తెలుసుకోండి: