టాలీవుడ్‌లోని చాలా మంది స్టార్ హీరోలు తమ ఫ్యామిలీల నుంచి హీరోలను పరిచయం చేస్తున్నారు. అలా ఇప్పటికే ఎంతో మంది వచ్చి సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్. మొదటి చిత్రంతోనే హిట్ కొట్టిన అతడు.. ఇప్పుడు 'ఆయ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు టాక్‌తో పాటు రెస్పాన్స్ కూడా బాగానే లభిస్తోంది. దీంతో కలెక్షన్లు ఊహించని విధంగా వస్తున్నాయి. కార్తీక్, సుబ్బు, హరి చిన్నపటినుంచు మంచి స్నేహితులు. వర్క్ ఫ్రమ్ హోం కోసం ఊరికి వచ్చిన కార్తీక్ పల్లవి అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమె కూడా అతడిని ఇష్ట పడుతుంది. అదే అమ్మాయిని సుబ్బు కూడా ప్రేమిస్తాడు. మరి పల్లవి ఎవరిని ప్రేమిస్తుంది..? వారి ప్రేమ పెళ్లిగా మారుతుందా? వారికి ఎలాంటి అడ్డంకులు ఎదురవుతాయి? వాటిని ఎలా పరిష్కరించారు? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఆయ్ సినిమాకి ఎంచుకున్న కథ పాతదే అయినప్పటికీ దానిని ప్రెజెంట్ చేసిన తీరు బాగుంది. సినిమాలోని ముఖ్య పాత్రలైన నార్నె నితిన్, కసిరెడ్డి రాజ్ కుమార్, అంకిత్ కొయ్య లు తమ పెర్ఫార్మన్స్ తో ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్మెంట్ చేశారు. ముందు నుంచి చెబుతున్నట్లు గానే ఈ సినిమాలో కామెడీ కి పెద్దపీట వేశారు.గోదావరి నేపథ్యంలో సాగే కథ కావడంతో సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. ఇక స్నేహితుల మధ్య సాగే సీన్స్ నవ్వులు పూయించాయి. అటు లవ్ స్టోరీ లో ఉండాల్సిన అంశాలు ఆకట్టుకున్నాయి. సర్ప్రైజ్ చేసే ట్విస్టులు ఉండటం ప్రేక్షకులను మెప్పించాయి.

సెకండ్ హాఫ్ లో కూడా కామెడీని కంటిన్యూ చేసిన తీరు బాగుంది. లవ్ స్టోరీ సక్సెస్ కావడానికి స్నేహితుల పాట్లు అక్కటుకుంటాయి. అయితే క్లైమాక్స్ లో వచ్చే ఆసక్తికరమైన ఎలివేషన్ ఈ సినిమాకే హైలైట్ అని చెప్పాలి.ఆయ్ చిత్రానికి రామ్ మిర్యాల అందించిన మ్యూజిక్ పెద్ద ప్లస్ అయిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పాటలతో పాటు బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా సెట్ అయిందని అంటున్నారు. మూవీ ఆసాంతం అన్ని అంశాల్లో సంగీతం ఆకట్టుకుంటుందని అంటున్నారు.మొత్తంగా, ఆయ్ చిత్రానికి ఎక్కువగా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. మ్యాడ్ సినిమా తర్వాత నార్నే నితిన్ మరో హిట్ కొట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. తక్కువ బడ్జెట్ సినిమా అయినా క్వాలిటీతో దర్శకుడు అంజి తెరకెక్కించారని చాలా మంది ప్రశంసిస్తున్నారు. ఆయ్ సినిమాను జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి సంయుక్తంగా నిర్మించారు.ఇక తాజాగా.. ఈ సినిమాను ఎన్టీఆర్ వీక్షించినట్లు తెలుస్తోంది. సినిమా చూడడమే కాదు.. పర్సనల్ గా ఆయ్ టీమ్ ను ఎన్టీఆర్ కలిసి వారిని అభినందించారు. సినిమా చాలా బావుందని, నితిన్ నటన సూపర్ అని మెచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఆయ్ ప్రమోషన్స్ లో నితిన్ తాను చెప్పిన మాటను నిలబెట్టుకున్నాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్టీఆర్ ను తీసుకొస్తారా.. ? అన్న ప్రశ్నకు నితిన్ సమాధానమిస్తూ.. ” ముందు మీరు సినిమాను హిట్ చేయండి.. తరువాత కచ్చితంగా బావను సక్సెస్ మీట్ కు పిలుస్తాను” అని చెప్పుకొచ్చాడు. అన్నట్టుగానే బావ చేత శభాష్ అనిపించుకున్నాడు.ఇక ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో ఎన్టీఆరే స్వయంగా పాల్గొన్నాడు. ఇక త్వరలో సక్సెస్ మీట్ కు గెస్ట్ గా ఆయన వచ్చినా ఆశ్చర్యం లేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. బ్లాక్ అండ్ బ్లాక్ లుక్ లో దేవర అదరగొట్టేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: