హృతిక్ రోషన్ ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాల్లో నటించి దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు. అతడు నటించిన బ్లాక్ బస్టర్ మూవీలలో క్రిష్ సిరీస్ సినిమాలు మెుదటి వరుసలో ఉంటాయి. క్రిష్ సిరీస్ మూవీలతో అద్భుతమైన విజయాలను అందుకోవడం మాత్రమే కాదు.. అదిరిపోయే క్రేజ్ ను కూడా సంపాదించుకున్నాడు. దేశవ్యాప్తంగా క్రేజ్ పెరిగింది. క్రిష్‌ ఫ్రాంఛైజీ చిత్రాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. హృతిక్‌ రోషన్‌ హీరోగా ఈ సిరీస్‌లో వచ్చిన కోయి మిల్‌గయా, క్రిష్‌, క్రిష్‌ 3 సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాల్ని అందుకున్నాయి.సూపర్ హీరో కథాంశంతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించాయి. దాదాపు పది సంవత్సరాల తర్వాత.. ఈ సిరీస్ లో నాలుగో భాగం తెరకెక్కనుంది. క్రిష్‌ 4 సినిమాకు అగ్నిపథ్‌ ఫేమ్‌ కరణ్‌మల్హోత్రా దర్శకత్వం వహించనున్నారు. త్వరలోనే హృతిక్ రోషన్ వార్ 2 షూటింగ్ మెుదలుకానుంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత వచ్చే ఏడాది అంటే 2024లో క్రిష్ 4 సినిమా పట్టాలెక్కనుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి.. స్క్రిప్ట్ వర్క్ జరగుతోంది.క్రిష్ 4 చిత్రాన్ని కరణ్ మల్హోత్రా గ్రాండ్ లెవెల్లో దర్శకత్వం వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. 2024 ద్వితీయార్ధంలో ప్రారంభించనున్నట్టుగా తెలుస్తోంది. మూవీని ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించాలని చూస్తున్నారట. క్రిష్ 4 కి సంబందించిన మెయిన్ ప్లాట్ సిద్ధం అయినా... పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేయడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇప్పటి వరకు క్రిష్ సిరీస్ మూవీలలో మూడు భాగాలు రూపొందాయి. ఆ మూడు భాగాలు కూడా అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్లు రాబట్టాయి. తిరుగులేని విజయం సాధించాయి. దీనికి కొనసాగింపుగా నాలుగో పార్టు వస్తుంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.క్రిష్‌4కు సంబంధించిన అప్‌డేట్‌ నెట్టింట వైరల్‌ అవుతుంది. ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్‌ మీదకు వెళ్తుంది. నాలుగో పార్టును హృతిక్‌ తండ్రి రాకేష్‌ రోషన్‌ కాకుండా అగ్నిపథ్‌ ఫేం కరణ్‌ మల్హోత్రా దర్శకత్వం వహించనున్నాడు. సిద్ధార్థ్‌ ఆనంద్‌తో కలిసి రాకేష్‌ రోషన్‌ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రస్తుతం హృతిక్‌ ఫైటర్‌తో పాటు వార్‌-2 సినిమాలు చేస్తున్నాడు.ఇదిలావుండగా ఈ ఫ్రాంచైజీలో బాలీవుడ్ బ్యూటీ శ్ర‌ద్ధా క‌పూర్ భాగం కానున్నట్లు బీటౌన్ టాక్‌. గ‌తంలో శ్ర‌ద్ధా ఒక ఫోటో సోష‌ల్ మీడియాలో పంచుకుంటూ ‘జాదూ లాంటి ఎండ కావాలి’ అంటూ కామెంట్ పెట్టింది. దీనికి హృతిక్ స్పందిస్తూ.. ‘అత‌ను వ‌స్తున్నాడు – అతనికి చెప్తాను’ అంటూ రిప్లై ఇవ్వడంతో క్రిష్‌- 4లో శ్ర‌ద్ధా క‌న్ఫామ్ అంటూ క‌థ‌లు అల్లేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: