టాలీవుడ్లో పాన్ ఇండియా హీరోగా పేరుపొందిన ప్రభాస్ బాహుబలి సినిమా నుంచి విభిన్నమైన చిత్రాలలో పాత్రలలో నటిస్తే అభిమానులను మెప్పిస్తూనే ఉన్నారు.. ముఖ్యంగా తన సినిమాలతో తెలుగు సినీ ఖ్యాతిని పెంచేస్తూ ఉన్నారు ప్రభాస్. చాలామంది కూడా ప్రభాస్ కథను సినిమాలను సైతం మెచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు అలాంటి వారి లిస్ట్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా చేరిపోయారు వాటి గురించి చూద్దాం.


ఈ రోజున సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లో నిర్వహించిన క్షత్రియ సేవా సమితి కార్యక్రమానికి హాజరు కాగా అక్కడ కొన్ని విషయాలను తెలియజేశారు. క్షత్రియులు కష్టపడి పనిచేయడం  వల్ల ఎక్కడైనా సరే వారు విజయాన్ని అందుకుంటారని తెలియజేశారు. విజయానికి నమ్మకానికి క్షత్రియులు మారుపేరు అంటూ తెలియజేశారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే తెలుగు సినిమా ఖ్యాతిని రెబల్ స్టార్ ప్రభాస్ కూడా దేశవ్యాప్తంగా విస్తరింఫేలా చేశారంటూ ప్రశంసించారు. హాలీవుడ్ రేంజ్ సినిమా బాహుబలిని ప్రభాస్ లేకుంటే అసలు ఎవరూ ఊహించలేమంటూ తెలియజేశారు. కృష్ణంరాజు పేరు లేకుండా తెలుగు సినిమా పరిశ్రమ గురించి చెప్పలేము అని కూడా తెలియజేశారు. ఆయన మన మధ్య లేకపోవడం మరింత బాధాకరం అంటూ తెలిపారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రాంగోపాల్ వర్మ వంటి వారు బాలీవుడ్ లో సత్తా చాటారని కూడా తెలియజేశారు.


 హైదరాబాద్ అభివృద్ధిలో రాజుల పాత్ర చాలా ఉందని ఫోర్త్ సిటీలో కూడా రాజులు పెట్టుబడులు పెట్టేందుకు సైతం ముందుకు రావాలని వారిని ఆహ్వానించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ విజయం వెనుక బోస్ రాజు కూడా చాలా కీలకమైన పాత్ర పోషించారని తెలియజేశారు రాష్ట్రంలో ఇండియా స్కిల్ యూనివర్సిటీని కూడా ప్రారంభించామంటే తెలియజేశారు.అందుకు కో చైర్మన్గా బోసు రాజులు నియమించామంటూ తెలియజేశారు. క్షత్రియలకు కూడా ఒక భవనం కావాలి అందుకు భూమి అనుమతులను కూడా ఇస్తున్నామని తెలియజేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: