ప్రభాస్ అప్‌కమింగ్ సినిమా ‘ఫౌజీ’ ఆగస్టు 17న హైదరాబాద్‌లో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఇమాన్వి అనే నటి ప్రభాస్‌కి జోడీగా నటిస్తోంది. దీనికి హను రాఘవపూడి డైరెక్టర్. ఈ సినిమా పూజ కార్యక్రమంలో ఇమాన్వి చాలా అందంగా కనిపించింది. ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది. ఇమాన్వి ఎవరు అనే ప్రశ్న చాలామందిని బాగా వేధిస్తోంది ఈ నేపథ్యంలో ఈ ముద్దుగుమ్మ ఎవరు ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో మనమూ తెలుసుకుందాం. ఇమాన్వి ప్రభాస్‌తో ఫౌజీతోనే తన సినిమా కెరీర్‌ను స్టార్ట్ చేయడానికి సిద్ధమయ్యింది. ఈ సినిమా షూటింగ్ ఆగస్టు 24 నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. ఇమాన్వి అసలు పేరు ఇమాన్ ఎస్మాయిల్. ఈ ముద్దుగుమ్మకు ప్రొఫెషనల్ డ్యాన్సర్. ఈవిడకు సోషల్ మీడియాలో చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 6 లక్షల మందికి పైగా ఫాలోవర్స్, యూట్యూబ్‌లో 4 లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్స్ ఉన్న ఆమె సినిమాల్లో నటించక ముందే చాలా ఫేమస్ అయిపోయింది. ఢిల్లీలో జన్మించిన ఇమాన్వి కేవలం డాన్సర్ మాత్రమే కాదు, కొరియోగ్రాఫర్ కూడా. డ్యాన్స్ ద్వారానే సోషల్ మీడియా స్టార్ గా ఎదిగింది. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది.

ప్రభాస్‌తో కలిసి ఆమె చేస్తున్న సినిమా 1940ల నేపథ్యంలో తెరకెక్కనుంది. ఈ పిరియడ్ డ్రామాలో ప్రభాస్ ఒక సైనికుడు, ఒక యోధుడిగా తన మాతృదేశం కోసం పోరాడుతుంటాడు. ఈ సినిమాతో ఇమాన్వి చాలా పాపులర్ అవుతుందని చెప్పుకోవచ్చు ఒకవేళ ఈ మూవీ హిట్ అయితే ఆమెకు తెలుగులో హిందీలో వరుసగా అవకాశాలు వస్తాయి. ఈ బ్యూటీ చాలా అందంగా ఉంది కాబట్టి హీరోలు కూడా ఈ ఫ్రెష్ ఫేస్ తో నటించడానికి చాలా ఆసక్తి కనబరచవచ్చు.

మునుపు ఈ సినిమాలో హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్ నటించబోతుందని వార్తలు వచ్చాయి. కానీ తాను ఈ సినిమాలో నటించడం లేదని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో స్పష్టం చేసింది. ఈ సినిమాలో మిథున్ చక్రవర్తి, జయప్రద వంటి ప్రముఖ నటులతో పాటు ఇమాన్వి కూడా నటిస్తున్నారు. ప్రభాస్ ఈ సినిమాలో బ్రిటిష్ ఆర్మీ సైనికుడిగా నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2025 చివరి నాటికి థియేటర్లలో విడుదల కావచ్చు. ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నది విశాల్ చంద్రశేఖర్. విశాల్ ఇప్పటికే ఈ సినిమాకు మూడు పాటలు కంపోజ్ చేశాడని రిపోర్ట్స్ పేర్కొంటున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: