ఆగష్టు 15ను టార్గెట్ చేస్తూ విడుదలైన ‘డబల్ ఇస్మార్ట్’ ‘మిష్టర్ బచన్’ సినిమాలు రెండు ఫెయిల్ అవ్వడంతో ఆ రెండు సినిమాలు కొనుక్కున్న బయ్యర్లతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడ షాక్ లో ఉన్నాయి. ఈ రెండు సినిమాల పోటీని లెక్క చేయకుండా విడుదలైన చిన్న సినిమా ‘ఆయ్’ హిట్ అవ్వడంతో ఏసినిమా హిట్ అవుతుందో మరే సినిమా ఫెయిల్ అవుతుందో తెలియని కన్ఫ్యూజన్ లో దర్శక నిర్మాతలతో పాటు బయ్యర్లు కూడ ఉండటంతో ఇక రానున్న రోజులలో సినిమాలు తీయడం మరింత కష్టంగా మారే ఆస్కారం కనిపిస్తోంది.



కొనసాగుతున్న ఈ కన్ఫ్యూజన్ వాతావరణం పై ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ కొన్ని ఆశక్తికర వ్యాఖ్యలు చేశారు. లేటెస్ట్ గా జరిగిన ‘రేవు’ అన్న చిన్న సినిమా ట్రైలర్ లాంచ్ ఫంక్షన్ లో దిల్ రాజ్ చేసిన వ్యాఖ్యలు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాయి. ప్రేక్షకులను ధియేటర్లకు రాకుండా చెడకొడుతుంది నిర్మాతలు మాత్రమే అంటూ కామెంట్స్ చేశారు. సినిమా విడుదలైన నాలుగు వారాలకే ఓటీటీ లో వస్తున్న పరిస్థితులలో సినిమాలు చూడటం కోసం ప్రేక్షకులు ధియేటర్లకు వచ్చే అలవాటును మర్చిపోతున్నారని ఘాటైన వ్యాఖ్యలు చేసారు.



కనీసం సినిమా విడుదల అయ్యాక 50 రోజుల వరకు ఓటీటీ లో స్ట్రీమ్ కాకుండా చూడగలిగితే బయ్యర్లు నష్టాల బాట పట్టకుండా తప్పించు కోగలుగుతారని అలా చేయకపోతే రానున్న రోజులలో సినిమాలను కొనడానికి బయ్యర్లు ముందుకు రారు అంటూ దిల్ రాజ్ తన ఆవేదన వ్యక్త పరిచారు. అయితే సినిమా నిర్మాణం అన్నది కార్పొరేట్ రంగంలా మారాలి అంటే సినిమా నిర్మాణాన్ని పరిశ్రమగా ప్రభుత్వాలు గుర్తించాలని అన్న డిమాండ్ కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతూ ఉన్నప్పటికీ ఈవిషయాల పై ఇండస్ట్రీ అభ్యర్థలను అటు ప్రభుత్వాలు కానీ ఇటు బ్యాంక్ లు కానీ పట్టించుకోకపోవడంతో నిర్మాత రోజురోజుకీ సమస్యల వలయంలో చిక్కుకుంటున్నాడు ఇండస్ట్రీ వర్గాలలో వ్యక్తమవుతున్నాయి ..


మరింత సమాచారం తెలుసుకోండి: