ఎన్నికల హడావిడితో టాలీవుడ్ కు ఎంతో కీలకమైన సమ్మర్ సీజన్  మిస్ అవ్వడంతో ధియేటర్స్ అన్ని కళా విహీనంగా మారిపోయాయి. అయితే  ఆతరువాత వచ్చిన ప్రభాస్ ‘కల్కి’ వసూళ్ల సునామీ సృష్టించడంతో   తెరిపిన పడ్డ టాలీవుడ్ ఈజోష్  ఆగష్టులో కూడ కొనసాగుతుంది అని భావించారు. టాలీవుడ్ బాక్సాఫీస్ చాల కీలకంగా భావించిన జెండా పండగ ఎవరు ఊహించని విధంగా నీరు కారిపోయింది.



భారీ అంచనాలతో  విడుదలైన ‘మిస్టర్ బచ్చన్’ ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాలు రెండు ఫ్లాప్ అవ్వడంతో ఈ రెండు సినిమాలను కొనుక్కున్న బయ్యర్లు తీవ్ర నష్టాల బాట పట్టినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో వీకెండ్ తరువాత వచ్చే  సోమవారం నుంచి పరిస్థితి ఎలా ఉంటుందో అని బయ్యర్లు విపరీతంగా టెన్షన్ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.    ఈ లలో విడుదలైన ‘ఆయ్’ ‘కమిటీ కుర్రోళ్ళు’ కలెక్షన్స్ పరావాలేదు అని అనిపిస్తున్నప్పటికీ మాస్ ప్రేక్షకులు ఈరెండు సినిమాలను చూడరు అన్న సంకేతాలు వస్తున్నాయి.



ఈవారంలో ధియేటర్స్ ఖాళీగానే కనిపించే ఆస్కార ఉంది. ఇక ఈవారం  రాబోతున్న ఆగస్ట్ 23న కూడ చిన్న  సినిమాల హడావిడి  మాత్రమే కనిపించబోతోంది. ఇలాంటి పరిస్థితులలో ఈనెల 29న విడుదల కాబోతున్న ‘సరిపోదా శనివారం’ మూవీ పై ఇండస్ట్రీ చాల ఆశలు పెట్టుకుంది. దర్శకుడు వివేక్ ఆత్రేయ నాని ఇలా కాంబినేషన్ కావడంతో ఈ మూవీ పై క్రేజ్ బాగానే ఉంది.



‘కల్కి’ తరువాత సరైన సినిమా చాడటానికి లేక బాధపడుతున్న సగటు ప్రేక్షకుడుకి ‘సరిపోదా శనివారం’ ఒక వారంలా మారుతుందని అంచనా. ‘దసరా’ ‘ఆయ్ నాన్న’ మూవీల విజయంతో మంచి జోష్ మీద ఉన్న నానిమూవీ తనకు పాన్ ఇండియా తనకు తెచ్చిపెడుతుందని నాని చాల నమ్మకంతో ఉన్నాడు. అయితే ఈమధ్య కాలంలో అంచనాలు పెంచుకుని విడుదలైన చాల సినిమాలు ఫ్లాప్ అవుతున్న పరిస్థితులలో నాని అంచనా;లు ఎంతవరాకు నిజం అవుతాయో చూడాలి అంటూ కొందరి కామెంట్స్..




మరింత సమాచారం తెలుసుకోండి: