దేవదాసు మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్ పోతినేని మొదటి సినిమాతోనే మంచి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు.దాంతో రామ్ పోతినేని యంగ్ హీరోలలో ఒకరిగా ఇండస్ట్రీలో రాణించారు  అలా ఈయన సినీ కెరియర్లో రామ రామ కృష్ణ కృష్ణ,కందిరీగ,రెడీ,నేను శైలజ, శివమ్,ఉన్నది ఒకటే జిందగీ, ఇస్మార్ట్ శంకర్ వంటి ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలు ఉన్నాయి. అయితే ఈయన చేసిన మోస్ట్ ఆఫ్ ది సినిమాల్లో ఫ్లాప్ అయినా కూడా రామ్ పోతినేని కి చాక్లెట్ బాయ్ గా.. ఎనర్జిటిక్ స్టార్ గా ఇండస్ట్రీలో పేరుంది. ఇక చాలామంది అమ్మాయి హృదయాల్లో లవర్ బాయ్ గా ఫిక్స్ అయిపోయారు. తెల్లటి పాల లాంటి అందంతో ఎంతో హ్యాండ్సమ్ గా ఉండే రామ్ పోతినేని ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. ఇక ఈ మధ్యనే డబుల్ ఇస్మార్ట్ మూవీతో థియేటర్లలోకి వచ్చిన రామ్ పోతినేని అంతగా ఆకట్టుకోలేదని చెప్పుకోవచ్చు.

అయితే రామ్ పోతినేని ఈ చిత్ర ప్రమోషన్స్ లో ఎన్నో విషయాలు చెప్పారు. అలా తన బెస్ట్ ఫ్రెండ్ తో ఆరు నెలల పాటు మాట్లాడలేదని కూడా ఓ సీక్రెట్ విషయాన్ని చెప్పారు. ఇక ఆరు నెలలు బెస్ట్ ఫ్రెండ్ తో మాట్లాడకపోవడానికి కారణం గొడవలే అని అనుకుంటారు.కానీ అలాంటిదేమీ లేదట. అలాగే ఆయన సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉండడంవల్ల తన ఫ్రెండ్స్ తో మాట్లాడడం కుదరలేదట. అంతేకాదు ఒకవేళ తన ఫ్రెండ్స్ ని కలవాలి అనుకుంటే వాళ్లు ప్రపంచంలో ఏ మూలన  ఉన్నా కూడా డైరెక్ట్ గా అక్కడికి వెళ్లి కలుస్తారట. అలా ఓ సమయంలో తన ఫ్రెండ్ ఆస్ట్రేలియాలో ఉన్నాడు అని తెలిసి ఆయన్ని కలవాలనిపించి వెంటనే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని వెళ్లారట.అలా తన మైండ్లో ఏ నిర్ణయం వస్తే అదే నిర్ణయం క్షణాల్లో తీసుకుంటూ ఉంటాడట రామ్.

అంతేకాదు రామ్ పోతినేని ఎక్కడికైనా వెళ్లాలి అనిపిస్తే క్షణాల్లోనే నిర్ణయం తీసుకొని వెంటనే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని వెళ్తూ ఉంటారట. అలాగే ఇండియాలో ఉన్నప్పుడు ఆయన థియేటర్లకి వెళ్లి సినిమాలు చూడరట. అందుకోసమే విదేశాలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా థియేటర్ కి వెళ్లి మంచి సినిమాలు చూస్తూ ఉంటారట. ఇక రామ్ పోతినేనికి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా కూడా వారితో ఎక్కువగా చిల్ అవ్వరట.కానీ కుటుంబంతోనే ఆయన ఎక్కువగా గడుపుతారట. అలాగే ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా సరే ఆరు నెలలు మాట్లాడని సందర్భాలు కూడా ఉన్నాయి.అలా అని ఇద్దరి మధ్య గొడవలు ఏం లేవు కానీ టైం కుదరక అలా మాట్లాడలేక పోతాను అంటూ రామ్ పోతినేని చెప్పుకొచ్చారు.. .

మరింత సమాచారం తెలుసుకోండి: