ఏ మాయ చేసావే నుంచి మొన్న విడుదలైన ఖుషి సినిమా వరకు సమంత తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. మొదటి సినిమాలో చాలా హాట్ రొమాన్స్ చేసి అందరి హృదయాలను కొల్లగొట్టింది. ఇక కృషి సినిమాలో ఒక హౌస్ వైఫ్ గా కనిపించి సినిమాతో ఎంతగా ఆలోచించిందో ఈ సినిమాతో కూడా అంతే అలరించింది. తెలుగు ప్రేక్షకులకు సంబంధాలకు మధ్య చాలా మంచి అనుబంధం ఉందని చెప్పుకోవచ్చు. ఆమె తెలుగువారి ఇంట ఒక ఫ్యామిలీ మెంబర్ అయిపోయింది అనడంలో సందేహం లేదు. నీకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు అయితే వారందరికీ ఆమె షాక్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది ఎందుకంటే ఆమె ఇకపై తెలుగులో నటించడానికి ఆసక్తి చూపించదేమో అని అనిపిస్తోంది.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్నీ’లో నటిస్తోంది. రాజ్, డీకే దర్శకత్వంలో వస్తున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్‌లో సమంత, వరుణ్ ధావన్ జంటగా నటిస్తున్నారు. నవంబర్ 7న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇది రిలీజ్ కానుంది. సమంతకు ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత చేస్తున్న వెబ్ సిరీస్ ఇది. ఆశ్వ ద్వారా ఈ ముద్దుగుమ్మకు చాలా ప్రశంసలందాయి. చాలా పవర్‌ఫుల్ క్యారెక్టర్ ఆమె పోషించింది. సిటాడెల్ సిరీస్‌లోనూ ఒక పవర్‌ఫుల్ రోల్ చేస్తోంది. దీని తర్వాత ఓ బాలీవుడ్ సినిమా చేయడానికి ఆమె ఒప్పుకున్నట్లుగా సమాచారం.

రాజ్ అండ్ డీకే నిర్మిస్తున్న "రక్త్ బ్రహ్మండ్"లో సమంత నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ప్రచారం జరుగుతోంది. ఇందులో ఆదిత్య రాయ్ కపూర్, వామికా గబ్బి హీరో హీరోయిన్లుగా నటించవచ్చు. రాహి అనిల్ బార్వే డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని నెట్‌ఫ్లిక్స్ కూడా ప్రొడ్యూస్ చేస్తోంది. సమంత ఇప్పటిదాకా ఒక తెలుగు సినిమాని కూడా ప్రకటించలేదు. నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత  మళ్లీ ఈ ఇండస్ట్రీకి రావడానికి ఆమె ఇంట్రెస్ట్ చూపించడం లేదా లేదంటే తన రేంజ్ కి ఓన్లీ బాలీవుడ్ సినిమాలయితేనే సరిపోతాయని ఆమె డిసైడ్ అయ్యిందా అనేది తెలియ రాలేదు.

 తెలుగు సినిమాల్లో కూడా ఆమెకు చాలా అవకాశాలు వస్తున్నాయని కానీ బాలీవుడ్ కోసం తెలుగు ఆఫర్లను ఆమె రిజెక్ట్ చేస్తూ ఉండని కూడా ఒక టాక్ నడుస్తోంది. వాస్తవానికి ఏం తెలుగు దర్శక నిర్మాతలు ఈ ముద్దుగుమ్మకు ఎక్కువ శాలరీలతో క్రేజీ ఆఫర్లను కూడా ఇస్తున్నారట. సమంత మాత్రం పాన్ ఇండియా ప్రాజెక్టులపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్లు సమాచారం. ఫ్యామిలీ మెన్ 2 తర్వాత ఈ ముద్దుగుమ్మ భారతదేశం వ్యాప్తంగా బాగా ఫేమస్ అయ్యింది. పాన్ ఇండియా ఆపై గ్లోబల్ యాక్ట్రెస్ గా ఆమె ఎదగాలని చూస్తోంది. అందుకే ప్రస్తుతానికి తెలుగు ఆఫర్లను సున్నితంగా తిరస్కరిస్తున్నట్లు సమాచారం.




మరింత సమాచారం తెలుసుకోండి: