ఇమాన్ ఇస్మాయిల్..ప్రస్తుతం సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో అందరి నోళ్ళల్లో ఎక్కువగా నానుతున్న పేరు..  ఎప్పుడైతే ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో రాబోయే ఫౌజి మూవీలో హీరోయిన్ అని ఆమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు మీడియాలో చక్కర్లు కొట్టాయో అప్పటినుండి ఈ కొత్త బ్యూటీ ఎవరు అని వెతికే పనిలో పడ్డారు నెటిజెన్స్.. ఇక ఆమె పేరు ఇమాన్ ఇస్మాయిల్ అని తెలియడంతో గూగుల్ లో ఆమె బ్యాగ్రౌండ్ గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు.. ఇమాన్ ఇస్మాయిల్ యూట్యూబ్ అలాగే ఇంస్టాగ్రామ్ లో డాన్స్ వీడియోలు చేస్తూ ఫేమస్ అయిపోయింది. ఈమెకు లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నట్టు తెలుస్తుంది.అంతేకాకుండా ఇమాన్ ఇస్మాయిల్ పాకిస్తాన్ మూలాలున్నప్పటికీ వీరి పేరెంట్స్ ఢిల్లీలో స్థిరపడ్డారు. అలా ఢిల్లీలో పుట్టి పెరిగిన ఇమాన్ డాన్సర్ కం కొరియోగ్రాఫర్..

 అలా సోషల్ మీడియాలో ఎంతో ఫేమస్ అయిన ఇమాన్ ఇస్మాయిల్ ని హను రాఘవపూడి తన సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం చేద్దామని భావించారు.అయితే హను రాఘవపూడి సినిమాలో హీరొయిన్ అప్పటి వరకు తెలియక పోయినప్పటికీ ఆ సినిమా హిట్ అయ్యాక పాపులర్ నటిగా పేరు తెచ్చుకుంటుంది. అలా ఇప్పటికే ఎలాంటి నేమ్ ఫేమ్ లేని మృణాల్ ఠాకూర్ ని సీతారామం సినిమా ద్వారా స్టార్ హీరోయిన్ గా మార్చారు.అలా ప్రభాస్ ఫౌజీ మూవీ లో కూడా ఇమాన్ ఇస్మాయిల్ అనే కొత్త బ్యూటీని ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం చేస్తున్నారు.అయితే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో డ్యాన్స్ వీడియోలు, రీల్స్ చేస్తూ నెలకు దాదాపు రెండు లక్షలు సంపాదిస్తుందట.

కానీ ప్రస్తుతం ప్రభాస్ వంటి పాన్ ఇండియా హీరోతో నటిస్తుంది కాబట్టి తన రెమ్యూనరేషన్  ఎక్కువగానే ఉండబోతున్నట్టు తెలుస్తోంది.ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఇమాన్ ఇస్మాయిల్ ఫౌజి మూవీకి ఒక కోటి రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్లు టాక్.. ఏది ఏమైనప్పటికి ప్రభాస్ సినిమాలో రెమ్యూనరేషన్ కంటే ముఖ్యంగా ఆయన పక్కన ఒకసారి నటిస్తే చాలు అనుకునే హీరోయిన్స్ ఎంతోమంది ఉన్నారు. కానీ ప్రస్తుతం ఆ అవకాశం కొత్త బ్యూటీ ఇమాన్ ఇస్మాయిల్ కి దక్కింది.. ఇక హనూ రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఫౌజీ మూవీ 1940 లో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కుతోంది.ఈ సినిమాలో ప్రభాస్ ఒక సైనికుడి పాత్రలో నటిస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: