తెలుగు సినీ పరిశ్రమలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న హీరోలలో మెగాస్టార్ చిరంజీవి , నందమూరి నట సింహం బాలకృష్ణ ముందు వరుసలో ఉంటారు . ఇక పోతే వీరిద్దరూ ఇప్పటి వరకు మూడు సార్లు సంక్రాంతి బరిలో పోటీ పడ్డారు. మరి అందులో ఎవరు ఎన్ని సార్లు గెలిచారు అనే వివరాలను తెలుసు కుందాం.

2001 వ సంవత్సరం నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా రూపొందిన నరసింహ నాయుడు , అదే తేదీన చిరంజీవి హీరోగా రూపొందిన మృగరాజు సినిమాలు విడుదల అయ్యాయి. ఇకపోతే ఈ రెండు సినిమాలు భారీ అంచనాల నడమే విడుదల కాగా నరసింహ నాయుడు మూవీ కి బ్లాక్ బస్టర్ టాక్ రాగా మృగరాజు సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చింది. దానితో ఆ సంక్రాంతి విన్నర్ గా బాలయ్య నిలిచాడు. ఇక చాలా సంవత్సరాల తర్వాత 2016 వ సంవత్సరం చిరంజీవి హీరోగా రూపొందిన ఖైదీ నెంబర్ 150 , బాలకృష్ణ హీరోగా రూపొందిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో సంక్రాంతి బరిలో నిలిచాయి.


మూవీ లలో ఖైదీ నెంబర్ 150 సినిమా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకోగా , గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా బాలకృష్ణ హీరోగా రూపొందిన వీరసింహా రెడ్డి మూవీ , చిరంజీవి హీరో గా రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమాలు విడుదల అయ్యాయి. ఇందులో వీర సింహా రెడ్డి మూవీ మంచి విజయాన్ని అందుకోగా , వాల్టేరు వీరయ్య సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇలా వీరిద్దరూ మూడు సార్లు సంక్రాంతి కి తలపడగా ఒక సారి బాలయ్య , రెండు సార్లు చిరంజీవి బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి విన్నార్లుగా నిలిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: