ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలు నటించిన సినిమాలు , భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమాల కంటే కూడా తక్కువ బడ్జెట్ తో రూపొందిన చిన్న సినిమాలే ఎక్కువ శాతం విజయాలను అందుకుంటున్నాయి. తక్కువ బడ్జెట్ తో రూపొందుతాయి కాబట్టి ఆ సినిమాలకు గనుక మంచి టాక్ వచ్చినట్లయితే ఆ మూవీ నిర్మాత లకు భారీ మొత్తం లో లాభాలు కూడా వస్తున్నాయి. ఆగస్టు నెలలో మాత్రం అలాంటి సంఘటనలు మరి ఎక్కువగా జరిగాయి. ఆగస్టు 9 వ తేదీన మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక నిర్మించిన కమిటీ కుర్రాళ్ళు అనే చిన్న సినిమా థియేటర్ లలో విడుదల అయింది.

మూవీ కి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ అద్భుతమైన కలెక్షన్ లను చేస్తుంది. ఈ మూవీ కి ఇప్పటికే సూపర్ సాలిడ్ కలెక్షన్ లు వచ్చాయి. అలాగే ఇప్పటికే భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని ఈ మూవీ ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర నమోదు చేసుకుంది. రెండవ వారంలో కూడా ఈ మూవీ చాలా సినిమాల నుండి పోటీని తట్టుకొని మంచి కలెక్షన్ లను రాబడుతుంది. ఇకపోతే ఆగస్టు 15 వ తేదీన చాలా భారీ బడ్జెట్ సినిమాల మధ్యలో బన్నీ వాసు నేర్పించిన ఆయ్ అనే ఓ చిన్న సినిమా విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమాకే మంచి టాక్ రావడంతో ప్రస్తుతం ఈ మూవీ కి సూపర్ సాలిడ్ కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కుతున్నాయి.

ఇక ఈ నెలలో రావు రమేష్ నటించిన మరో చిన్న సినిమా కూడా థియేటర్ లలో విడుదల కానుంది. రావు రమేష్ తాజాగా మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ఆగస్టు నెలలోనే విడుదల కానుంది. ఇకపోతే ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా కూడా విజయం సాధిస్తే ఆగస్టు నెలలో చిన్న సినిమాలు డామినేషన్ ఎక్కువ అయినట్లే అవుతుంది. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: