రవితేజ హీరోగా రూపొందిన మిస్టర్ బచ్చన్ సినిమా ఆగస్టు 15 వ తేదీన విడుదల అయింది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 4 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 4 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి అనే వివరాలు తెలుసుకుందాం.

మూవీ కి 4 రోజుల్లో నైజాం ఏరియాలో 2.92 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 1.07 కోట్లు ,  ఉత్తరాంధ్రలో 72 లక్షలు , ఈస్ట్ లో 42 లక్షలు , వెస్ట్ లో 31 లక్షలు , గుంటూరు లో 50 లక్షలు , కృష్ణ లో 32 లక్షలు , నెల్లూరు లో 25 లక్షఎల్ కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల్లో కలిపి ఈ మూవీ కి 6.51 కోట్ల షేర్ , 10.15 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. 4 రోజుల్లో ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 42 లక్షల కలెక్షన్లు దక్కగా , ఓవర్ సీస్ లో 53 లక్షల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకి 4 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 7.46 కోట్ల షేర్ , 12.05 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి.


ఇకపోతే ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 31 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా ఈ మూవీ 32 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ మరో 24.54 కోట్ల షేర్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని క్లీన్ హీట్ గా నిలుస్తుంది. ఇకపోతే హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత టీ జీ విశ్వ ప్రసాద్ నిర్మించగా ... భాగ్య శ్రీ బోర్స్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. జగపతి బాబు ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: