తమిళ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించకుండా నటులలో విక్రమ్ ఒకరు. ఇకపోతే విక్రమ్ తన కెరీర్ లో ఎక్కువ శాతం వైవిధ్యమైన సినిమాలలోనే నటించాడు. ఈయన నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర విఫలం అయిన కూడా విక్రమ్ మాత్రం ఎప్పుడూ కూడా కమర్షియల్ సినిమాలలో నటించి కెరియర్ ను ముందుకు నెట్టుకోవాలి అని అనుకోకుండా వైవిధ్యమైన సినిమాలలో నటిస్తే కెరియర్ ను ముందుకు సాగిస్తున్నాడు. దానితో చాలా సంవత్సరాల పాటు కెరియర్ ను కొనసాగిస్తున్న విక్రమ్ కు చాలా తక్కువ విజయాలు ఉన్నాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా విక్రమ్ "తంగాలన్" అనే ఓ వైవిధ్యమైన సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ కి పా రంజిత్ దర్శకత్వం వహించగా ... మాళవిక మోహన్ ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఆగస్టు 15 వ తేదీన ఈ సినిమా భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ లభించింది.

దానితో ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు అద్భుతమైన కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 26.15 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ సంవత్సరం విడుదల అయిన ఇండియన్ సినిమాలలో అత్యధిక కలెక్షన్ లను వసూలు చేసిన సినిమాలు లిస్టులో ఇది టాప్ టెన్ లో నిలిచింది. ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమాకు మంచి కలెక్షన్ లు వరల్డ్ వైడ్ గా దక్కుతున్నాయి. అపరిచితుడు సినిమా తర్వాత విక్రమ్ కు ఇదే మంచి విజయం అయ్యే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: