ఈ సంవత్సరం తెలుగు సినిమాల హవా జోరుగా కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఇండియా వ్యాప్తంగా అనేక సినిమాలు విడుదల అయ్యాయి. అందులో మొదటి రోజు కలెక్షన్ల విషయంలో టాప్ 10 లో నిలిచిన సినిమాలలో నాలుగు తెలుగు సినిమాలే ఉన్నాయి. మొత్తం టాప్ 10 లో ఉన్న సినిమాలు ఏవి అనే వివరాలను తెలుసుకుందాం.

ప్రభాస్ హీరోగా రూపొందిన కల్కి 2898 AD సినిమా విడుదల అయిన మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 183.20 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి ఈ సంవత్సరం విడుదల అయిన సినిమాలలో రిలీజ్ అయిన మొదటి రోజు అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన మూవీల లిస్టులో మొదటి స్థానంలో నిలిచింది. ఇక శ్రద్ధ కపూర్ ప్రధాన పాత్రలో రూపొందిన "స్త్రీ 2" మూవీ మొదటి రోజు 83.45 కోట్ల కలెక్షన్ లను వసులు చేసి రెండవ స్థానంలో నిలిచింది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా రూపొందిన గుంటూరు కారం సినిమా మొదటి రోజు 79.30 కోట్ల కలక్షన్ లను వసులు చేసి మూడవ స్థానంలో నిలవగా , ఇండియన్ 2 మూవీ 58.0 కోట్ల కలెక్షన్లతో నాలుగవ స్థానంలోనూ , ఫైటర్ మూవీ 35.65 కోట్ల కలెక్షన్లతో ఐదవ స్థానంలోనూ , బడే మియా చోటే మియా సినిమా 32 కోట్ల వసూలతో ఆరవ స్థానంలోనూ , తంగాలన్ మూవీ 26.15 కోట్ల కలెక్షన్లతో ఏడవ స్థానంలోనూ , హనుమాన్ సినిమా 24.5 కోట్ల కలెక్షన్లతో ఎనిమిదవ స్థానంలోనూ , టిల్లు స్క్వేర్ మూవీ 23.70 కోట్ల కలెక్షన్లతో 9 వ స్థానం లోనూ ,  రాయన్ సినిమా 23.40 కోట్ల కలెక్షన్లతో పదవ స్థానం లోనూ నిలిచాయి. ఇకపోతే ఈ టాప్ 10 లో నిలిచిన సినిమాలలో కల్కి 2898 AD , గుంటూరు కారం , హనుమాన్ , టిల్లు స్క్వేర్ ఇలా నాలుగు తెలుగు సినిమాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: