రామ్ పోతినేని తాజాగా డబల్ ఈస్మార్ట్ అనే సినిమాలో హీరోగా నటించాడు. కావ్య దాపర్ఈ మూవీ లో హీరోయిన్ గా నటించగా , పూరి జగన్నాథ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సంజయ్ దత్ ఈ మూవీలో విలన్ పాత్రలో నటించగా ... ఈ మూవీ కి మణిశర్మ సంగీతం అందించాడు. ఆగస్టు 15 వ తేదీన ఈ మూవీ థియేటర్లో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల మొదటి రోజే బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద మొత్తంలో నెగిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమాకు కలెక్షన్లు కూడా భారీగా దక్కడం లేదు. ఈ మూవీకి భారీ మొత్తంలో నష్టాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. మరి ఈ మూవీ కి ఇప్పటి వరకు ఎన్ని కలెక్షన్లు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి సంబంధించిన నాలుగు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ఇప్పటివరకు కంప్లీట్ అయింది. ఈ నాలుగు రోజుల్లో ఈ సినిమాకు నైజాం ఏరియాలో 3.70 కోట్ల కనెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 1.33 కోట్లు , ఉత్తరాంధ్రలో 1.08 కోట్లు ,ఈస్ట్ 67 లక్షలు , వెస్టు లో 37 లక్షలు , గుంటూరు లో 90 లక్షలు , కృష్ణ లో 55 లక్షలు , నెల్లూరులో 31 లక్షల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల్లో 8.91 కోట్ల షేర్ , 13.40 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. నాలుగు రోజుల్లో ఈ సినిమాకు కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియాలో 90 లక్షల కలెక్షన్లు దక్కగా , ఓవర్సీస్ లో 72 లక్షల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా నాలుగు రోజుల్లో 10.52 కోట్ల షేర్ , 16.90 కోట్ల గ్రాస్ కలెక్షన్ దక్కాయి. ఈ మూవీకి 48 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా , ఈ సినిమా 49 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారిలోకి దిగింది. ఈ మూవీ మరో 38.48 కోట్ల చీర కలెక్షన్లను వరల్డ్ వైడ్ గా రాబట్టినట్లు అయితే ఈ సినిమా క్లీన్ హీట్ గా నిలుస్తుంది. ఇకపోతే ఈ సినిమాకు ప్రస్తుతం వస్తున్న కలెక్షన్లను బట్టి చూస్తే ఈ మూవీ బ్రేక్ ఈవెన్  ఫార్ములాను కంప్లీట్ చేసుకోవడం దాదాపు కష్టం అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ram